HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Deflated Spy Balloon

Spy Balloon: చిచ్చు పెట్టిన గూఢచర్య బెలూన్..

బ్లింకెన్ చైనా (China) పర్యటన క్యాన్సిల్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చైనా పట్ల ఎంతో కఠిన వైఖరి ప్రదర్శించడం తెలిసిందే.

  • Author : Maheswara Rao Nadella Date : 04-02-2023 - 12:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chuina Spy Balloon
Chuina

బ్లింకెన్ చైనా పర్యటన క్యాన్సిల్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చైనా పట్ల ఎంతో కఠిన వైఖరి ప్రదర్శించడం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన బైడెన్ సర్కారు చైనా విషయంలో మధ్యేమార్గాన్ని అనుసరిస్తోంది. ఈ క్రమంలో 2018 తర్వాత తొలిసారిగా అమెరికా నుంచి అత్యున్నత స్థాయి నేతలు బీజింగ్ లో పర్యటించే ముందు అనుకోని పరిణామం చోటు చేసుకుంది. చైనా పంపించిన ఓ హాట్ ఎయిర్ బెలూన్ (Spy Balloon) అమెరికా గగనతలంలో చక్కర్లు కొట్టడం రెండు దేశాల మధ్య అగాధాన్ని పెంచింది.

దీన్ని గూఢచర్య బెలూన్ (Spy Balloon) గా అమెరికా భావిస్తోంది. అమెరికా వాయవ్య ప్రాంతంలో ఇది వెళ్లడాన్ని అమెరికా రక్షణ శాఖ గుర్తించింది. సదరు బెలూన్ ను పేల్చివేస్తే కిందనున్న ప్రజలకు ప్రాణ ప్రమాదం ఏర్పడుతుందని భావించి దాన్ని ఏమీ చేయలేదు. కాకపోతే కీలకమైన అణ్వస్త్రాలు ఉంచిన ప్రాంతాలపై ఇది సంచరించడంతో చైనా గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు అమెరికా అనుమానించింది.

పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింటెన్, అమెరికా ట్రెజరీ మంత్రి జానెట్ యెల్లెన్ బీజింగ్ పర్యటనను రద్దు ( ప్రస్తుతానికి వాయిదా) చేసుకున్నారు. అమెరికా గగనతలంలో స్పై బెలూన్ (Spy Balloon) సంచరించడం అన్నది తమ దేశ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ పేర్కొంది. తన పర్యటనకు ముందు జరిగిన ఈ ఘటన బాధ్యతారహితమైనదిగా ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు.

దీనిపై చైనా విచారం వ్యక్తం చేసింది. పౌర వాతావరణం, ఇతర శాస్త్రీయ అవసరాల కోసం ప్రయోగించగా, అది దారి తప్పి వచ్చినట్టు వివరణ ఇచ్చుకుంది. చైనా బాధ్యతాయుతమైన దేశమని, అంతర్జాతీయ చట్టాలకు ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆ దేశ విదేశాంగ వ్యవహారాల డైరెక్టర్ యాంగ్ ఈ బ్లింకెన్ కు స్పష్టం చేశారు.

Also Read:  Twitter Blue Tick: బ్లూ టిక్ సబ్ స్క్రైబర్లకు ఆదాయం.. ట్విట్టర్ నిర్ణయం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • china
  • Spy Balloon
  • world

Related News

20 US States On Alert As Venomous Chinese Ant

Chinese Ant: అమెరికాలో చైనా చీమలు కుడితే ప్రాణాపాయం..

అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న చైనాకు చెందిన ‘ఏషియన్ నీడిల్ ఆంట్’ అనే ప్రమాదకరమైన చీమల జాతి గురించి ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చైనా మూలాలు కలిగిన ఈ ‘ఏషియన్ నీడిల్ ఆంట్స్’ ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్, పెన్సిల్వేనియా సహా సుమారు 20 రాష్ట్రాలకు విస్తరించాయి. ఐదో వంతు అంగుళం పరిమాణంలో, ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉండే ఈ

    Latest News

    • Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

    • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

    • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

    • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

    • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd