HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Dark Energy Camera Captures Gods Hand Reaching For The Stars

Gods Hand : దర్శనమిచ్చిన ‘గాడ్స్ హ్యాండ్’.. ఏమిటిది ?

Gods Hand : డార్క్ ఎనర్జీ కెమెరాకు ‘గాడ్స్ హ్యాండ్’ ఫొటో చిక్కింది.  ఇంతకీ ఏమిటిది ?

  • By Pasha Published Date - 02:19 PM, Tue - 14 May 24
  • daily-hunt
Gods Hand
Gods Hand

Gods Hand : డార్క్ ఎనర్జీ కెమెరాకు ‘గాడ్స్ హ్యాండ్’ ఫొటో చిక్కింది.  ఇంతకీ ఏమిటిది ? నిజంగా గాడ్స్ హ్యాండేనా ? అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరేం లేదు.. చిలీ దేశంలోని విక్టర్ ఎం బ్లాంకో 4-మీటర్ అనే భారీ  టెలిస్కోప్‌ ఉంది. దానిపై  అతిపెద్ద డార్క్ ఎనర్జీ కెమెరాను అమర్చారు. అది తాజాగా పాలపుంతకు సంబంధించిన ఒక ఫొటోను తీసింది. అందులోనే ‘గాడ్స్ హ్యాండ్’ (Gods Hand) దర్శనమిచ్చింది. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ వార్తను చదవాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join

భూమికి 1300 కాంతి సంవత్సరాల దూరంలో CG 4 అనే కామెట్రీ గ్లోబుల్‌ ఉంది. కామెట్రీ గ్లోబుల్ అంటే తోకచుక్కల సమూహం కాదు. ఇది ఎరుపు కాంతితో కూడిన పొగలు, ధూళితో కూడిన సమూహం. చుట్టుపక్కల ఉండే నక్షత్రాల రేడియేషన్ ప్రభావం వల్ల CG 4 అనే కామెట్రీ గ్లోబుల్‌ నిత్యం వేడిగానే ఉంటుంది. ఇందులో అయోనైజ్డ్ హైడ్రోజన్ ఉంటుందని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. పొగలు, ధూళితో ఉండటం వల్ల దీని ఆకారం మారుతుంటుంది. దీని సైజు అతిభారీగా ఉంటుందని అంటున్నారు.

Also Read : Telangana Politics : తెలంగాణలో ప్రాంతీయ పార్టీల శకం ముగిసిపోతుందా?

తాజాగా చిలీ దేశంలోని డార్క్ ఎనర్జీ కెమెరాకు చిక్కిన CG 4  కామెట్రీ గ్లోబుల్‌ తోక భాగంలో అయోనైజ్డ్ హైడ్రోజన్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఎరుపు రంగు కాంతి గాఢత ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. అలా ఎరుపు రంగులో ఉన్న CG 4 కామెట్రీ గ్లోబుల్ తోక భాగం అనేది.. దానికి 100 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలోని  ESO 257-19 అనే స్పైరల్ గెలాక్సీ వైపుగా ఉండటం డార్క్ ఎనర్జీ కెమెరాకు చిక్కింది. అది చేయి ఆకారంలో కనిపించడంతో సైంటిస్టులు గాడ్స్ హ్యాండ్ అని పేరు పెట్టారు. వాస్తవానికి అదొక కామెట్రీ గ్లోబుల్.

Also Read : Advocates : లాయర్లపై కన్జ్యూమర్ కోర్టుల్లో దావాలు వేయకూడదు.. సుప్రీంకోర్టు తీర్పు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dark Energy Camera
  • Gods Hand
  • stars

Related News

    Latest News

    • Iphone : 2026లో యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్..!

    • ODI Cricketers: టీమిండియా టాప్‌-5 వ‌న్డే ఆట‌గాళ్లు వీరే!

    • viral Video : రైలులోని టాయిలెట్ ను బెడ్ రూమ్ గా మార్చేసుకున్న ప్రయాణికుడు

    • Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!

    • Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    Trending News

      • Bus Fire Accident : 10మంది ప్రాణాలు కాపాడిన హరీష్‌కుమార్.!

      • Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!

      • ఈ 6 రాశుల వారికి అప్పులిస్తే జాగ్రత్త..! తిరిగి డబ్బులు రావడం కష్టమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు

      • Five Habits: మీలో కూడా ఈ ఐదు అలవాట్లు ఉన్నాయోమో చెక్ చేసుకోండి!

      • Virat Kohli: ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ ప‌ట్టు త‌గ్గిపోయిందా? గ‌ణాంకాలు ఇవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd