Wanted Informants : ఇన్ఫార్మర్లు కావలెను.. అమెరికా సీఐఏ సంచలన ప్రకటన
సీఐఏ ఇన్ఫార్మర్లుగా పనిచేసే ఆసక్తి కలిగిన వారు సీక్రెట్‌గా ఎలా సంప్రదించాలనే సమాచారాన్ని కూడా ఆ పోస్టులో(Wanted Informants) ప్రస్తావించడం గమనార్హం.
- By Pasha Published Date - 04:40 PM, Thu - 3 October 24

Wanted Informants : సీఐఏ (సెంట్రల్ ఇంటెలీజెన్స్ ఏజెన్సీ).. ఇది అమెరికా గూఢచార సంస్థ. మన దేశ గూఢచార సంస్థ పేరు.. ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్). ఇతర దేశాల సీక్రెట్ సమాచారాన్ని సేకరించడమే వీటి పని. ప్రపంచంలోని టాప్-3 గూఢచార సంస్థల జాబితాలో అమెరికా సీఐఏతో పాటు మోసాద్ (ఇజ్రాయెల్), ఎంఐ6 (బ్రిటన్) ఉంటాయి. ఎంఐ6 అంటే మిలిటరీ ఇంటెలీజెన్స్ సెక్షన్ 6. అయితే తాజాగా అమెరికా సీఐఏ సోషల్ మీడియా వేదికగా సంచనల పోస్ట్ చేసింది. దానిపై అంతటా చర్చ జరుగుతోంది. వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Also Read :Kamala Harris Husband : ఓ యువతితో కమలా హ్యారిస్ భర్త అఫైర్.. బ్రిటీష్ పత్రిక సంచలన కథనం
అమెరికా ప్రధాన శత్రుదేశాలు చైనా, ఉత్తర కొరియా, ఇరాన్, రష్యా. ఇప్పటికే రష్యాలో పెద్దసంఖ్యలో అమెరికా సీఐఏ గూఢచారులు ఉన్నారు. అయితే చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌లలో అంతగా లేరు. దీంతో ఆ మూడు దేశాల్లో తమ నెట్‌వర్క్‌ను పెంచుకునేందుకు సీఐఏ ప్లాన్ చేస్తోంది. ఆయా దేశాల్లో తమ కోసం పనిచేసే ఇన్ఫార్మర్లను నియమించుకునే పనిలో సీఐఏ పడింది. ఈవివరాలను తెలుపుతూ చైనా భాష మాండరిన్, ఇరాన్ భాష ఫార్సీ, ఉత్తర కొరియా భాష కొరియన్‌లలో రూపొందించిన పోస్టును ఫేస్ బుక్, ఎక్స్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, లింక్డిన్ వేదికగా అప్‌లోడ్ చేసింది. సీఐఏ ఇన్ఫార్మర్లుగా పనిచేసే ఆసక్తి కలిగిన వారు సీక్రెట్‌గా ఎలా సంప్రదించాలనే సమాచారాన్ని కూడా ఆ పోస్టులో(Wanted Informants) ప్రస్తావించడం గమనార్హం.
Also Read :Google – Adani : అదానీ గ్రూపుతో గూగుల్ జట్టు.. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యం
వీపీఎన్, టోర్ నెట్‌వర్క్ ద్వారా తమ అధికారిక వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సీఐఏ కోరింది. ఆయా దేశాలు కేంద్రంగా పనిచేసే వీపీఎన్‌లు మాత్రం వాడొద్దని అభ్యర్థులకు సూచించింది. గతంలో ఇదే విధంగా ఎంతోమంది ఇన్ఫార్మర్లను రష్యాలోనూ సీఐఏ నియమించుకుందని సమాచారం. మొత్తం మీద సీఐఏ చేసిన ఈ పోస్టును చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంత బహిరంగంగా ఇన్ఫార్మర్లను సీఐఏ రిక్రూట్ చేసుకుంటోందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కొరియా లాంటి దేశాల్లో ఎవరైనా ఔత్సాహికులు ఉన్నా.. అక్కడ ఇంటర్నెట్‌పై బ్యాన్ ఉన్నందున అప్లై చేసే పరిస్థితి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చైనా, ఇరాన్ లాంటి దేశాల్లో ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సక్సెస్ కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ మూడు దేశాలు కూడా ఎవరైనా విదేశీ ఇన్ఫార్మర్లు దొరికితే కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి.