HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Adani Group Google Announce Tie Up To Supply Clean Energy In India

Google – Adani : అదానీ గ్రూపుతో గూగుల్ జట్టు.. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యం

దీనికి సంబంధించి ఆయా సంస్థలు గూగుల్ -అదానీ గ్రూప్(Google - Adani) జాయింట్ వెంచర్ ఒప్పందాలు కుదుర్చుకోనుంది.

  • Author : Pasha Date : 03-10-2024 - 3:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Google Adani Clean Energy India

Google – Adani : అదానీ గ్రూప్, గూగుల్ జట్టు కట్టాయి. మనదేశంలో క్లీన్ ఎనర్జీ సరఫరాను పెంచడమే లక్ష్యంగా ఈ రెండు కంపెనీలు చేతులు కలిపాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్లాంట్‌ గుజరాత్‌లో ఉంది.  ఇందులో మొదలుకానున్న కొత్త ప్రాజెక్టులో కలిసి పనిచేసేందుకే అదానీ గ్రూప్, గూగుల్ జట్టుకట్టాయి. ఈవిషయంపై ఇరు కంపెనీలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. గుజరాత్‌లోని ఖవ్డాలో ఉన్న పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్లాంటులో సరికొత్త సోలార్ అండ్ విండ్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ 2025 జూన్ తర్వాత కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. ఈ ప్రాజెక్టులోనే గూగుల్, అదానీ గ్రూపులు కలిసి పనిచేయనున్నాయి.  ఈ ప్రాజెక్టు వల్ల భారతదేశ గ్రిడ్‌కు మరింత స్వచ్ఛమైన విద్యుత్ అందుతుందని ఇరుకంపెనీలు వెల్లడించాయి.

Also Read :Iran Hit List : ఇజ్రాయెల్ టార్గెట్‌గా ఇరాన్ హిట్ లిస్ట్.. ఏ1గా బెంజమిన్ నెతన్యాహూ

ఖవ్డాలో ఉన్న పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్లాంటులో సోలార్ పవర్, పవన్ విద్యుత్‌ను భారీగా ఉత్పత్తి చేస్తారు.  ఇక్కడి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఎప్పటికప్పుడు పారిశ్రామిక కారిడార్లకు, వాణిజ్య కస్టమర్లకు, కంపెనీలకు సప్లై చేస్తారు. దీనికి సంబంధించి ఆయా సంస్థలు గూగుల్ -అదానీ గ్రూప్(Google – Adani) జాయింట్ వెంచర్ ఒప్పందాలు కుదుర్చుకోనుంది. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ విడుదలను సాధ్యమైనంత త్వరగా తగ్గించే మిషన్ కావడం వల్లే ఈ ప్రాజెక్టులో తాము అదానీ గ్రూపుతో కలిసి పనిచేసేందుకు అంగీకరించామని గూగుల్ వెల్లడించింది. యావత్ భారతదేశంలో స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తికి తమవంతుగా చేదోడును అందిస్తామని తెలిపింది. పర్యావరణానికి మేలు చేసే ప్రాజెక్టులను గూగుల్ తప్పకుండా ప్రోత్సహిస్తుందని పేర్కొంది. అదానీ గ్రూపు ఇలాంటి విశిష్ట విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును చేపట్టడాన్ని గూగుల్ కొనియాడింది.టెక్నాలజీ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న గూగుల్.. భారత విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టడాన్ని కీలక పరిణామంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఈ పరిణామం అదానీ గ్రూపునకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read :Fake SBI Branch : ఫేక్ ఎస్‌బీఐ బ్రాంచ్.. రూ.లక్షలు కుచ్చుటోపీ.. ఉద్యోగాలు అమ్ముకున్న వైనం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • adani
  • Adani group
  • Clean Energy
  • google
  • Google - Adani
  • india

Related News

Prime accused in 11-year-old girl's rape and murder case killed in police encounter.

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

  • A new chapter in India-Japan relations

    India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd