Chinese Fishing Boat: హిందూ మహాసముద్రంలో చైనా బోటుకు ప్రమాదం.. 39 మంది సిబ్బంది గల్లంతు
చైనా ఫిషింగ్ బోట్ (Chinese Fishing Boat) హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. అందులో ఉన్న 39 మంది సిబ్బంది తప్పిపోయారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా వెల్లడించింది.
- By Gopichand Published Date - 10:03 AM, Wed - 17 May 23

Chinese Fishing Boat: చైనా ఫిషింగ్ బోట్ (Chinese Fishing Boat) హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. అందులో ఉన్న 39 మంది సిబ్బంది తప్పిపోయారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పడవ మునిగిపోయిన ఘటన చోటుచేసుకుందని ‘సీసీటీవీ’ ఛానల్ పేర్కొంది. సిబ్బందిలో 17 మంది చైనీయులు ఉన్నట్లు వార్తల్లో చెప్పబడింది. హిందూ మహాసముద్రంలో చేపల వేటకు వచ్చిన చైనా బోటు ప్రమాదానికి గురైంది. బీజింగ్ మీడియా ప్రకారం.. చైనా ఫిషింగ్ బోట్ హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. అందులో ఉన్న 39 మంది సిబ్బంది తప్పిపోయారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లు బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ తెలిపింది.
చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌కు చెందిన 39 మంది ఉన్నారు
39 మంది సిబ్బందిలో 17 మంది చైనా, 17 మంది ఇండోనేషియా, ఐదుగురు ఫిలిప్పీన్స్‌కు చెందిన వారని నివేదిక పేర్కొంది. అయితే మునిగిపోవడానికి గల కారణాలపై ఎలాంటి సమాచారం అందలేదు. చైనీస్ నాయకుడు జి జిన్‌పింగ్, ప్రీమియర్ లీ కియాంగ్ విదేశాలలో ఉన్న చైనా దౌత్యవేత్తలతో పాటు వ్యవసాయం, రవాణా మంత్రిత్వ శాఖలను వారిని వెతకడానికి సహాయం చేయాలని ఆదేశించారు.
Also Read: NIA: టెర్రరిస్టు, గ్యాంగ్‌స్టర్‌లపై ఎన్‌ఐఏ చర్యలు.. 100 చోట్ల దాడులు
చైనా అతిపెద్ద ఫిషింగ్ ఫ్లీట్‌ను నడుపుతోంది
‘లుపెంగ్లైయువాన్యు నం. 8’ అనే పేరుగల ఈ నౌకను పెంగ్లైయింగ్యు కంపెనీ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిషింగ్ ఫ్లీట్‌ను చైనా నిర్వహిస్తుందని నమ్ముతారు. దీనిలో చాలా మంది నెలలు లేదా సంవత్సరాల పాటు సముద్రంలో ఉంటారు. వారికి చైనీస్ స్టేట్ మెరిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీలు, విస్తృతమైన నౌకల నెట్‌వర్క్ సహాయం చేస్తుంది. ఆస్ట్రేలియా, అనేక ఇతర దేశాల నుండి సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని బ్రాడ్‌కాస్టర్ తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం చైనా రెండు నౌకలను మోహరించింది. చైనా మారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ఘటనపై సంబంధిత దేశాలకు సమాచారం అందించింది.