Chinas New Weapon: చైనా కొత్త బాంబు.. దడ పుట్టించే నిజాలు
గత సంవత్సరం ప్రపంచంలోనే మొదటి మీథేన్ ఆధారిత రాకెట్‌ను చైనా(Chinas New Weapon) ప్రయోగించింది.
- By Pasha Published Date - 08:48 PM, Tue - 22 April 25

Chinas New Weapon: తొలిసారిగా శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును చైనా పరీక్షించింది. ఈ ప్రయోగ పరీక్ష సక్సెస్ అయింది. అయితే ఈ సరికొత్త హైడ్రోజన్ బాంబు చాలా భిన్నమైందని చైనా వెల్లడించింది. సర్వసాధారణ హైడ్రోజన్ బాంబుల్లా.. ఇది అణు సంలీనం (nuclear fusion)పై ఆధారపడదని చైనా స్పష్టం చేసింది. మెగ్నీషియం హైడ్రైడ్ అనే పదార్థాన్ని ఉపయోగించే రసాయనిక ప్రక్రియ ద్వారా ఈ బాంబు పేలుతుందని తెలిపింది. దీని ఫలితంగా శక్తివంతమైన అగ్నిగోళం ఏర్పడుతుందని చెప్పింది. అణు పదార్థాలు లేకున్నా.. నిరంతరాయంగా ఈ బాంబు అధిక ఉష్ణాన్ని ఉత్పత్తి చేయగలదు.
చైనా కొత్త బాంబు గురించి..
- ఈ సరికొత్త హైడ్రోజన్ బాంబును చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్ (CSSC) తయారు చేసింది.
- దీని బరువు కేవలం 2 కిలోలే.
- సంప్రదాయ అణు బాంబులు అణు చర్యల ద్వారా పనిచేస్తాయి. కానీ ఇది అణు సంలీనంపై ఆధారపడదు.
- ఈ బాంబు పేలడానికి మెగ్నీషియం హైడ్రైడ్‌ను ఉపయోగిస్తుంది.
- ఈ బాంబు సంప్రదాయ పీడన ట్యాంకుల కంటే గణనీయంగా అధిక సాంద్రతతో హైడ్రోజన్‌ను నిల్వ చేసుకోగలదు.
- ఈ బాంబు పేలినప్పుడు మెగ్నీషియం హైడ్రైడ్ వేగంగా విస్ఫోటనం చెంది హైడ్రోజన్ వాయువును వాతావరణంలోకి రిలీజ్ చేస్తుంది. ఆ హైడ్రోజన్ వాయువు గాలితో కలవగానే భారీగా మంటలు రేగుతాయి.
- ఈ బాంబు పేలాక భారీ అగ్నిగోళం ఏర్పడుతుంది. అది 2 సెకన్ల పాటు 1,000 డిగ్రీల సెల్సీయస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను వెదజల్లుతుంది. ఇది TNT పేలుళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే ఉష్ణోగ్రత కంటే చాలా రెట్లు ఎక్కువ.
- ఈ విస్ఫోటకం అనేది అల్యూమినియం మిశ్రమాలతో తయారైన పదార్థాలను కూడా కాల్చి బూడిద చేయగలదు.
- ప్రస్తుతం చైనాలో పెద్దసంఖ్యలో మెగ్నీషియం హైడ్రైడ్ ఉత్పత్తి అవుతోంది. షాన్జీ ప్రావిన్స్‌లో సంవత్సరానికి 150 టన్నుల మెగ్నీషియం హైడ్రైడ్‌ను ఉత్పత్తి చేయగల ప్లాంటు ఉంది.
- మెగ్నీషియం హైడ్రైడ్‌ను సబ్‌మెరైన్ ఫ్యూయల్ సెల్స్, ఎక్కువసేపు పనిచేసే డ్రోన్‌ల వంటి సైనిక అవసరాలకు శక్తి వనరుగా కూడా వాడుకోవచ్చు.
- గత సంవత్సరం ప్రపంచంలోనే మొదటి మీథేన్ ఆధారిత రాకెట్‌ను చైనా(Chinas New Weapon) ప్రయోగించింది.