China Virus Lab In US : అమెరికాలో చైనా డేంజరస్ వైరస్ ల్యాబ్.. డయాగ్నస్టిక్ ల్యాబ్ మాటున నిర్వహణ
China Virus Lab In US : అమెరికాలో నడుస్తున్న చైనా సీక్రెట్ వైరస్ ల్యాబ్ బయటపడింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని రీడ్లీ సిటీలో దీన్ని గుర్తించారు.
- By Pasha Published Date - 10:49 AM, Wed - 2 August 23

China Virus Lab In US : అమెరికాలో నడుస్తున్న చైనా సీక్రెట్ వైరస్ ల్యాబ్ బయటపడింది.
కాలిఫోర్నియా రాష్ట్రంలోని రీడ్లీ సిటీలో దీన్ని గుర్తించారు.
చైనాకు చెందిన ఒక బయోటెక్ కంపెనీ నడుపుతున్న ఆ ల్యాబ్ లో వందలకొద్దీ ప్రమాదకర వైరస్‌లతో ప్రయోగాలు చేస్తున్నట్టు వెల్లడైంది.
ఈవిషయం తెలియడంతో రీడ్లీ సిటీ ప్రజలు ఉలిక్కిపడ్డారు.
ఆ ల్యాబ్ లో కరోనా వైరస్, మలేరియా వైరస్, హెచ్‌ఐవీ వైరస్, హెపటైటిస్ వైరస్, స్పృహలేని స్థితిలో 1000 ఎలుకలు, 200 చనిపోయిన ఎలుకలు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది.
వందలకొద్దీ కుండలలో వైరస్‌లను నింపి ఇండస్ట్రియల్ ఫ్రీజర్‌లలో నిల్వచేసి ఉంచారని అమెరికా ప్రభుత్వ అధికారులు కనుగొన్నారు.
“ప్రెస్టీజ్ బయో టెక్” పేరుతో కాలిఫోర్నియా రాష్ట్రంలోని రీడ్లీ సిటీలో చైనాకు చెందిన ఒక డయాగ్నస్టిక్ ల్యాబ్ ఏర్పాటైంది. అందులో స్థానికులకు కరోనా టెస్టులు, ప్రెగ్నెసీ టెస్టులు చేసేవారు. ఆ చైనా ల్యాబ్ బిజినెస్ చేస్తోందని అందరూ భావించారు. కానీ ఆ ల్యాబ్ సెల్లార్ లోపలి నుంచి బయటికి గ్యాస్ రిలీజ్ అయ్యేందుకు ఒక గొట్టాన్ని అమర్చడంతో ఆరోగ్య విభాగం అధికారులకు అనుమానం వచ్చింది. వారు వెళ్లి తనిఖీ చేయగా.. డయాగ్నస్టిక్ ల్యాబ్ మాటున ప్రమాదకర వైరస్ లతో రీసెర్చ్ చేసే ల్యాబ్ నడుస్తోందని బట్టబయలైంది. బిల్డింగ్ లోని సెల్లార్ భాగంలో సీక్రెట్ ల్యాబ్ ను(China Virus Lab In US) నడిపిస్తున్నారని తేలింది. కరోనా ఇన్ఫెక్షన్ ను నిర్ధారించే టెస్ట్ కిట్ లను ఎలుకలపై పరీక్షిస్తున్నట్టు తెలిసింది.
Also read : Beer From Shower Water : షవర్, సింక్, వాషింగ్ మెషీన్ నీళ్లతో ఆ బీర్ రెడీ
20 రకాల ప్రమాదకర వైరస్ లను ఆ ల్యాబ్ లో గుర్తించారు. అయితే వాటితో ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు ? ఆ ల్యాబ్ కు టెస్ట్ కోసం వచ్చే వాళ్ళకు ఏవైనా డేంజరస్ వైరస్ లు సోకేలా చేశారా ? అనేది ఇంకా తెలియదు. “ప్రెస్టీజ్ బయో టెక్” పేరుతో నడిపిస్తున్న ఈ డయాగ్నస్టిక్ ల్యాబ్ కు కాలిఫోర్నియాలో బిజినెస్ చేసే పర్మిషన్స్ లేవని అధికారులు చెప్పారు. గతంలో తమ కంపెనీ పేరు “యూనివర్సల్ బయోటెక్” అని ఉండేదని, ఇప్పుడు పేరు మార్చి కొనసాగిస్తున్నామని చైనా ల్యాబ్ నిర్వాహకులు అధికారులకు తెలిపారు. దీనిపై అమెరికా ఆఫీసర్లు ఆరా తీయగా.. ఆ రెండు పేర్లలో దేనితో కూడా కంపెనీలు రిజిస్టర్ అయి లేవని వెల్లడైంది.