Beer From Shower Water : షవర్, సింక్, వాషింగ్ మెషీన్ నీళ్లతో ఆ బీర్ రెడీ
Beer From Shower Water : అది బీర్ కాని బీర్..ఎలాంటి బీరో తెలిస్తే మీరు అవాక్కవుతారు..దాని తయారీకి ఏమేం వాడతారో తెలిస్తే మరింత షాక్ అవుతారు..
- By Pasha Published Date - 07:57 AM, Wed - 2 August 23

Beer From Shower Water : అది బీర్ కాని బీర్..
ఎలాంటి బీరో తెలిస్తే మీరు అవాక్కవుతారు..
దాని తయారీకి ఏమేం వాడతారో తెలిస్తే మరింత షాక్ అవుతారు..
సాధారణంగా అయితే బీర్ ను మొక్కజొన్న, బార్లీ, బియ్యం, ఈస్ట్, నీళ్లు, హాప్స్ పువ్వులతో తయారు చేస్తారు..కానీ మనం ఇప్పుడు పరిచయం చేసుకోబోయే బీర్ ను ఇంట్లోని షవర్ నుంచి వచ్చే నీరు, సింక్‌ల లోకి వెళ్లే నీరు, వాషింగ్ మెషీన్‌ల నుంచి రిలీజ్ అయ్యే నీటితో తయారు చేస్తారు. అయితే తాము బీర్ ను తయారు చేసేముందు ఈ నీళ్లను బాగా రీసైక్లింగ్ చేస్తామని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వాటర్ ప్యూరి ఫైయింగ్ కంపెనీ ఎపిక్ క్లీన్ టెక్ చెబుతోంది. మైక్రోఫిల్ట్రేషన్ ద్వారా, అతినీలలోహిత కిరణాల కాంతితో ఆ నీటిని ప్యూరిఫై చేశాకే బీర్ తయారీకి వాడుతామని అంటోంది.
Also read : Warning Labels On Each Cigarette : ఇక ప్రతి సిగరెట్ పై వార్నింగ్ లేబుల్
ప్రపంచం నీటి కొరతను అధిగమించాలనే టార్గెట్ తో తాము ఈవిధంగా షవర్లు, సింక్‌లు, వాషింగ్ మెషీన్‌ల నీటిని రీసైక్లింగ్ చేసి బీర్ తయారు చేస్తున్నామని ఎపిక్ క్లీన్ టెక్ నిర్వాహకులు అంటున్నారు. వాడి వదిలేసిన నీటిని కూడా మళ్ళీ ఈవిధంగా వినియోగంలోకి తెచ్చి, మద్యం ప్రియుల కోరికను తీరుస్తున్నామని వెల్లడించారు. స్థానికంగా ఉండే ఒక బ్రూవరీతో కలిసి తాము “ఎపిక్ వన్ వాటర్ బ్రూ” పేరుతో ఈ బీర్‌ను ప్రయోగాత్మకంగా తక్కువ మోతాదులో తయారు చేశామని తెలిపారు. దీన్ని అమ్మకాల కోసం మార్కెట్లోకి రిలీజ్ చేయలేదని చెప్పారు. రీసైకిల్ చేసిన నీటితో బీర్ తయారీకి(Beer From Shower Water) ప్రస్తుతానికి అమెరికాలో అనుమతులు లేవన్నారు.
Also read : Emoji : ఆ ఎమోజీ(emoji)వాడితే జైలుకే, భారీ జరిమానా కూడా… ఎక్కడో తెలుసా?