China: కాలుష్యం తగ్గించేందుకు చైనా పర్యావరణ శాఖ కొత్త రూల్
ప్రపంచంలోని వాహన తయారీ సంస్థలు ఎక్కువగా చైనాలోనే ఉన్నాయి. ఆ దేశం నుంచి ఇతర దేశాలకు ఎక్కువగా వాహనాలు సరఫరా అవుతుంటాయి.
- By Praveen Aluthuru Published Date - 04:44 PM, Sun - 14 May 23

China: ప్రపంచంలోని వాహన తయారీ సంస్థలు ఎక్కువగా చైనాలోనే ఉన్నాయి. ఆ దేశం నుంచి ఇతర దేశాలకు ఎక్కువగా వాహనాలు సరఫరా అవుతుంటాయి. కాగా చైనాలో అధిక సంఖ్యలో వాహనాలు వినియోగించడం వల్ల కాలుష్యం పెను సమస్యగా మారింది. అయితే దీన్ని కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుని రూల్ పాస్ చేసింది.
చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం ఏంటంటే .. వాహనం నడుపుతున్నప్పుడు సదరు వెహికిల్ రియల్ టైమ్ ఉద్గార పరీక్షను నిర్వహించడం ఇప్పుడు తప్పనిసరి. అదే సమయంలో జాతీయ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాల అమ్మకం, దిగుమతి మరియు తయారీని నిషేధించాలని చైనా నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ VI B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాల విక్రయానికి చైనా మంత్రిత్వ శాఖ ఆరు వారాల గడువు ఇచ్చింది.
మార్చిలో ఫిచ్ రేటింగ్స్ ఉద్గార ప్రమాణాలను కఠినతరం చేయడం వల్ల వాహన తయారీదారులు మరియు డీలర్లపై ఒత్తిడి పెరుగుతుందని, దీని కారణంగా రాబోయే కాలంలో జాతీయ VI B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాలపై చాలా తగ్గింపులు చవిచూస్తోంది. చైనా ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రకారం.. కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాలను విక్రయించడానికి గ్రేస్ పీరియడ్ ఇవ్వబడింది. మార్చి చివరి నాటికి చైనా జాతీయ VI B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని రెండు మిలియన్లకు పైగా వాహనాలు ఉన్నాయట. చైనాలో ఈ గ్రేస్ పీరియడ్ పొడిగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
Read More: 300 CRORE BUNGALOW : ఇట్లు..ఝున్‌ఝున్‌వాలా 300 కోట్ల ఇల్లు