Black Friday Sale America : అమెరికాలో మొదలైన బ్లాక్ ఫ్రైడే సేల్..ఆఫర్లు మాములుగా లేవు
ఏటా థాంక్స్ గివింగ్ మరునాడు వచ్చే బ్లాక్ ఫ్రైడే రోజున పెద్ద ఎత్తున షాపింగ్ ఫెస్టివల్ జరగడం ఆనవాయితీగా వస్తోంది
- Author : Sudheer
Date : 02-12-2023 - 4:32 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రతి ఏడాది మాదిరిగానే ఈఏడాది కూడా అమెరికా (America ) లో బ్లాక్ ఫ్రైడే సేల్ (Black Friday Sale) మొదలైంది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తుంటారు. ఏటా థాంక్స్ గివింగ్ మరునాడు వచ్చే బ్లాక్ ఫ్రైడే రోజున పెద్ద ఎత్తున షాపింగ్ ఫెస్టివల్ జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఫిలడెల్ఫియాలోని ప్రముఖ కంపెనీలు బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభి.. కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి.
We’re now on WhatsApp. Click to Join.
క్రిస్మస్ రాకను ఆహ్వానిస్తూ శాంటా క్లాజ్ పరేడ్స్ జరుగుతుంటాయి. పెద్దపెద్ద సంస్థలు తమ ఉత్పత్తులను అడ్వర్‌టైజ్ చేసుకునేందుకు ఈ పరేడ్లను స్పాన్సర్ చేస్తుంటాయి. కొన్ని సంస్థలు ‘బ్లాక్ థర్స్ డే’ పేరుతో గురువారం నుంచే సేల్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో పెద్దఎత్తున కస్టమర్లు షాపింగ్ చేయటానికి తరలి వచ్చారు. దీంతో అన్ని షాపులు కిటకిటలాడుతున్నాయి.
Read Also : Delhi: ఢిల్లీలో ప్రతికూల వాతావరణం-18 విమానాలు దారి మళ్లింపు