Islamic Nation : రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్’ తీసేస్తారా ? బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశం అవుతుందా ?
తాజాగా ఆయన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో(Islamic Nation) సంచలన వాదనలు వినిపించారు.
- By Pasha Published Date - 01:37 PM, Thu - 14 November 24

Islamic Nation : బంగ్లాదేశ్‌లో ఏం జరగబోతోంది ? ఇస్లామిక్ దేశంగా బంగ్లాదేశ్‌ను మార్చబోతున్నారా ? అంటే.. ఔను అనే సంకేతాలు ఇచ్చేలా ప్రస్తుత పరిణామాలు జరుగుతున్నాయి. అవేంటో ఈ వార్తలో తెలుసుకుందాం..
Also Read :Lottery King : లాటరీ కింగ్‌పై ఈడీ రైడ్స్.. 20 ప్రాంతాల్లో సోదాలు
ఎండీ అసదుజ్జమా.. ఈయన బంగ్లాదేశ్ ప్రభుత్వ అటార్నీ జనరల్. బంగ్లాదేశ్ ప్రభుత్వం తరఫున కేసులను అసదుజ్జమా వాదిస్తుంటారు. తాజాగా ఆయన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో(Islamic Nation) సంచలన వాదనలు వినిపించారు. దేశ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అసదుజ్జమా కోరారు. బంగ్లాదేశ్‌లోని 90 శాతం మంది ప్రజలు ఇస్లాం మతానికి చెందినవారు అయినందున సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో ఉండాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని 15వ సవరణపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ అసదుజ్జమా ఈ వివాదాస్పద సూచనలు చేశారు.
Also Read : World Diabetes Day 2024 : డయాబెటిస్ తీవ్రమైతే రక్తనాళాలకు పెద్ద గండం
‘‘గతంలో బంగ్లాదేశ్ రాజ్యాంగం అల్లాపై విశ్వాసం ఉంచేది. ఇకపై అలాగే ఉండాలని మేం కోరుకుంటున్నాం. ఆర్టికల్ 2ఏ అన్ని మతాలకు సమాన హక్కుల గురించి చెబుతుంది. ఆర్టికల్ 9 బెంగాలీ జాతీయత గురించి చెబుతుంది. ఇవి రెండూ పరస్పర విరుద్ధమైన అంశాలు’’ అని అసదుజ్జమా పేర్కొన్నారు.‘‘మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ను జాతిపితగా పిలవాలని ప్రజలను బలవంతం చేసేలా రాజ్యాంగంలోని 15వ సవరణ ఉంది. దాన్ని రద్దు చేయాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. ఆమెను భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు తీసుకెళ్లి చట్టపరంగా శిక్షించేందుకు బంగ్లాదేశ్ సర్కారు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఇప్పటికే ఇంటర్ పోల్ సాయాన్ని కోరింది. ఇంటర్ పోల్ అధికారులు భారత విదేశాంగ శాఖ, హోంశాఖలను సంప్రదించే అవకాశం ఉంది. హసీనా అప్పగింతపై భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వేచిచూడాలి.