Lottery King : లాటరీ కింగ్‌పై ఈడీ రైడ్స్.. 20 ప్రాంతాల్లో సోదాలు
లాటరీ కింగ్‌పై విచారణ జరిపేందుకు తాజాగా ఈడీకి మద్రాస్ హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. దీనివల్లే మరోసారి రైడ్స్(Lottery King) మొదలయ్యాయి.
- By Pasha Published Date - 01:11 PM, Thu - 14 November 24

Lottery King : శాంటియాగో మార్టిన్ .. ఈయనను లాటరీ కింగ్ అని పిలుస్తుంటారు. గతంలోనూ లాటరీ కింగ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రైడ్స్ చేసింది. తాజాగా మరోసారి ఇవాళ (గురువారం) శాంటియాగో మార్టిన్‌పై ఈడీ దాడులు జరిగాయి. లాటరీ కింగ్‌పై విచారణ జరిపేందుకు తాజాగా ఈడీకి మద్రాస్ హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. దీనివల్లే మరోసారి రైడ్స్(Lottery King) మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి చెన్నై సహా పలు ప్రాంతాల్లోని శాంటియాగో మార్టిన్ కార్యాలయాలు, నివాసాలపై రైడ్స్ జరుగుతున్నాయి.
ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్‌పై అభియోగాలు..
మార్టిన్‌కు చెందిన కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వరల్డ్ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉండటం గమనార్హం. ఈ కంపెనీ ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో వంటి వాటిని నిర్వహిస్తుంటుంది. అందుకే మార్టిన్ సంపాదన భారీగా ఉంటుంది. ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ కంపెనీ మనీలాండరింగ్ చట్టాలను ఉల్లంఘించిందని ఈడీ ఆరోపిస్తోంది. లాటరీ స్కీంల వ్యవహారంలో సిక్కిం ప్రభుత్వానికి రూ.900 కోట్ల నష్టం తీసుకొచ్చిన కేసులో గతేడాది మార్టిన్‌పై ఈడీ రైడ్స్ చేసింది. ఆ సమయంలో దాదాపు రూ.450 కోట్ల మార్టిన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అంతకుముందు 2011లో కోయంబత్తూర్‌లో మార్టిన్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. భూ ఆక్రమణలు, మోసం చేయడం వంటి ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు.
Also Read :World Diabetes Day 2024 : డయాబెటిస్ తీవ్రమైతే రక్తనాళాలకు పెద్ద గండం
ఎవరీ మార్టిన్ ?
- మార్టిన్ సాధారణ కుటుంబం నుంచి అత్యంత సంపన్నుడి స్థాయికి ఎదిగాడు.
- 2019-2024 మధ్యలో వివిధ రాజకీయ పార్టీలకు మార్టిన్ దాదాపు రూ.1,300 కోట్ల విరాళాలను అందించాడు. దీన్నిబట్టి ఆయన సంపాదన ఏ రేంజులో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
- మార్టిన్ ప్రారంభం మాత్రం చాలా చిన్నగానే జరిగింది. తొలినాళ్లలో ఆయన మయన్మార్‌లో కూలీగా పనిచేశారు.
- 1988లో మయన్మార్ నుంచి భారత్‌కు తిరిగొచ్చి తమిళనాడు కేంద్రంగా లాటరీ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. దాన్ని కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు విస్తరించారు.
- తదుపరిగా ఈశాన్య భారత్‌కు మార్టిన్ షిఫ్ట్ అయ్యారు. అక్కడే ఉంటూ ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాల లాటరీ స్కీమ్‌లతో బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు.
- ఈశాన్య రాష్ట్రాలకు సమీపంలో ఉండే భూటాన్, నేపాల్‌లకు కూడా తన బిజినెస్‌ను విస్తరింపజేశాడు.
- ఈవిధంగా లాటరీ టికెట్ల వ్యాపారంలో సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం, టెక్స్‌టైల్, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడిగా పెట్టాడు.