HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Bangladesh Army Chief Says Have Given Shelter To Some People Of Ousted Govt

Bangladesh Army Chief: బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. పోలీసులు ఇంకా షాక్‌లోనే ఉన్నారంటూ కామెంట్స్‌..!

బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ బుధవారం (ఆగస్టు 14) గత అవామీ లీగ్ ప్రభుత్వంలోని కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చారని వెల్లడించారు.

  • By Gopichand Published Date - 07:49 PM, Wed - 14 August 24
  • daily-hunt
Bangladesh Army Chief
Bangladesh Army Chief

Bangladesh Army Chief: బంగ్లాదేశ్‌లో రెండు నెలల సుదీర్ఘ రిజర్వేషన్ వ్యతిరేక విద్యార్థి ఉద్యమం తర్వాత ఆగస్టు 5న ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. కాగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ (Bangladesh Army Chief).. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంలోని కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులకు ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించారు.

బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ బుధవారం (ఆగస్టు 14) గత అవామీ లీగ్ ప్రభుత్వంలోని కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చారని వెల్లడించారు. తద్వారా వారిపై ఎలాంటి దాడులు జరగకుండా నిరోధించవచ్చన్నారు. మైనారిటీల సమస్యలపై బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ 20 జిల్లాల్లో మైనారిటీలకు సంబంధించిన మొత్తం 30 దాడులు జరిగాయన్నారు. ఘటనలపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. నేరస్తులను న్యాయస్థానం ముందు నిలబెట్టి అందరికీ శిక్షలు పడేలా చేస్తామ‌న్నారు.

Also Read: Har Ghar Tiranga: హర్ ఘర్ తిరంగా స‌ర్టిఫికేట్‌ను పొందండి ఇలా..!

బంగ్లాదేశ్ పోలీసులు ఇంకా షాక్‌లోనే ఉన్నారు- ఆర్మీ చీఫ్

ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ మాట్లాడుతూ.. కొంద‌రి ప్రాణాలకు ముప్పు ఉన్నందున మేము వారికి ఆశ్రయం ఇచ్చాము. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని అన్నారు. అయితే పోలీసులు మాత్రం షాక్‌లోనే ఉన్నారు. ఇది పూర్తయితే మళ్లీ పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించగలుగుతారన్నారు.
.
ఇదే సమయంలో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ ఒక‌ ప్రకటన చేశారు. మాజీ న్యాయ మంత్రి అనుసుల్ హక్, మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రైవేట్ పరిశ్రమ పెట్టుబడుల సలహాదారు సల్మాన్ ఎఫ్. రెహమాన్‌ను ఢాకాలో అరెస్టు చేశారు. కాగా, మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్, మాజీ సహాయ మంత్రి జునైద్ అహ్మద్‌లను గత వారం ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అయితే అప్పటి ప్రధాని షేక్ హసీనా ఆ పదవికి రాజీనామా చేసి దేశం విడిచి భారత్‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టినప్పటి నుండి అవామీ లీగ్ పార్టీకి చెందిన చాలా మంది పెద్ద నాయకులు ఎంపీలు, క్యాబినెట్ మంత్రులు దేశం నుండి వెళ్లిపోయారు. కాగా పలువురు ఇతర మంత్రులు తమ ప్రభుత్వ లేదా ప్రైవేట్ నివాసాలను విడిచిపెట్టారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు సమాచారం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Army Chief
  • bangladesh
  • Bangladesh Crisis
  • international news
  • world news

Related News

Fastest Trains

Fastest Trains: ప్ర‌పంచంలో అత్యంత వేగంగా న‌డిచే రైళ్లు ఇవే!

460 కిమీ/గం (చైనా) షాంఘై మ్యాగ్లెవ్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు. అయస్కాంత ఉద్గమం (Magnetic Levitation - Maglev) ఉపయోగించే ప్రపంచంలో ఏకైక ప్రయాణీకుల రైలు.

  • North Korea- South Korea

    North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

  • Nuclear Testing

    Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Nepal

    Nepal: నేపాల్‌లో ఘోరం.. ఏడుగురు మృతి!

  • Strongest Currencies

    Strongest Currencies: ప్ర‌పంచంలో అత్యంత బలమైన టాప్ 10 కరెన్సీలు ఇవే!

Latest News

  • Blood Pressure: రాత్రిపూట రక్తపోటు ఎందుకు పెరుగుతుంది?

  • Zodiac Signs: కర్ణుడి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఈ రాశుల‌వారిలోనే ఉంటాయ‌ట‌!

  • Parliament Winter Session: పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు.. డిసెంబ‌ర్ 1 నుంచి హీట్ పెంచ‌బోతున్నాయా?

  • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

  • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

Trending News

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd