US Visa : అమెరికా వీసా ట్రై చేసేవారికి బ్యాడ్ న్యూస్
US Visa : ఈ కొత్త నిబంధనను అమెరికా హోంశాఖ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. దేశానికి వచ్చే వలసదారుల సమాచారాన్ని మరింత కట్టుదిట్టంగా పరిశీలించేందుకు
- By Sudheer Published Date - 11:12 AM, Sat - 8 March 25

అమెరికా (US) వెళ్లాలని కలలుకంటున్నవారికి మరో షాక్. ఇకపై అమెరికా వీసా ( US Visa) లేదా గ్రీన్ కార్డు(Green Card)కు అప్లై చేసుకునే వ్యక్తులు తమ సోషల్ మీడియా వివరాలను (Social Media Details) కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనను అమెరికా హోంశాఖ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. దేశానికి వచ్చే వలసదారుల సమాచారాన్ని మరింత కట్టుదిట్టంగా పరిశీలించేందుకు, భద్రతా ప్రమాణాలను పెంచేందుకు ఈ కొత్త చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
Women’s Day: స్త్రీల సలహాలు ఖచ్చితంగా పాటించాలి – సర్వే చెపుతున్న మాట
సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల స్వభావం, వారి ఆలోచనా విధానం, పౌర సమాజంపై వారి ప్రభావం వంటి అంశాలను అంచనా వేయడానికి అమెరికా ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డిన్ వంటి ప్రధాన సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలను, పోస్టులను ప్రభుత్వ అధికారులు పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా అభ్యర్థి గతంలో ఎలాంటి వ్యాఖ్యలు, అభిప్రాయాలు వ్యక్తం చేశాడనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
హెచ్-1బీ వీసా, ఈబీ-5 వీసా కోసం ట్రై చేస్తున్నవారికి ఈ కొత్త నిబంధన ఇబ్బందికరంగా మారవచ్చు. సామాజిక మాధ్యమాల్లో ఎవరు ఏమి పోస్ట్ చేస్తారో అనేక సందర్భాల్లో వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశముంది. అంతే కాదు, గతంలో పెట్టిన పోస్టుల ఆధారంగా అభ్యర్థులను అంగీకరించాలా? తిరస్కరించాలా? అనే అంశాన్ని అధికారులు నిర్ణయించనున్నారు. దీంతో చాలా మంది అభ్యర్థులు తమ అకౌంట్లను తొలగించే లేదా మార్పులు చేసుకునే అవకాశముంది.
Warangal MGM: తల్లడిల్లుతున్న ‘ఉత్తర తెలంగాణ’ పెద్ద దిక్కు!
ఈ కొత్త మార్పులు అమెరికాలో వలసదారుల సంఖ్యను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విధానం వ్యక్తిగత గోప్యత హక్కులను ఉల్లంఘిస్తుందా? అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. అమెరికా వీసా కోసం ప్రయత్నిస్తున్నవారు ఇకపై తమ సోషల్ మీడియా వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.