Victory For Sikh Faith : స్కూళ్లలో సిక్కుల “కిర్పాన్” పై బ్యాన్ ను రద్దు చేసిన కోర్టు
Victory For Sikh Faith : సిక్కు స్టూడెంట్స్ కిర్పాన్‌లను ధరించి స్కూళ్లకు రాకుండా విధించిన బ్యాన్ ను కోర్టు ఎత్తేసింది.
- By Pasha Published Date - 09:25 AM, Sun - 6 August 23

Victory For Sikh Faith : సిక్కు స్టూడెంట్స్ కిర్పాన్‌లను ధరించి స్కూళ్లకు రాకుండా విధించిన బ్యాన్ ను కోర్టు ఎత్తేసింది.
తద్వారా సిక్కు స్టూడెంట్స్ కు మతపరమైన స్వేచ్ఛను ప్రసాదించింది.
ఈమేరకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలోని స్కూళ్లలో కిర్పాన్ ధరించడంపై విధించిన నిషేధాన్ని రద్దు చేసింది.
Also read : Gyanvapi Mosque Survey : జ్ఞానవాపి మసీదు సర్వేపై హిందూ పక్షం న్యాయవాది కీలక ప్రకటన
“జాతి వివక్ష చట్టం (RDA) ప్రకారం కిర్పాన్ పై నిషేధం రాజ్యాంగ విరుద్ధం” అని క్వీన్స్‌లాండ్ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కిర్పాన్ పై నిషేధం వల్ల సిక్కు విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడం తగ్గిపోయిందని ఈ కేసులో సిక్కుల తరఫు పిటిషనర్ కమల్‌జిత్ కౌర్ అథ్వాల్ వాదన వినిపించారు. మత విశ్వాసంలో భాగంగా సిక్కులు ఎల్లవేళలా తమ వెంట తీసుకెళ్లాల్సిన 5 మత చిహ్నాలలో ఒకటైన కిర్పాన్‌పై.. ఈ నిషేధం వివక్ష చూపేలా ఉందని అథ్వాల్ దాఖలు చేసిన పిటిషన్ లోని వాదనలతో క్వీన్స్‌లాండ్ సుప్రీంకోర్టు ఏకీభవించింది. మతపరమైన చిహ్నంగా కిర్పాన్‌ను సిక్కు స్టూడెంట్స్ స్కూళ్లకు తీసుకెళ్లే విషయంలో అభ్యంతరం చెప్పకూడదని క్వీన్స్‌లాండ్ విద్యాశాఖను కోర్టు(Victory For Sikh Faith) ఆదేశించింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటామని విద్యా శాఖ వెల్లడించింది.