Attack on Hindu temple : హిందూ దేవాలయంపై దాడి…విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు..!!
బంగ్లాదేశ్‌లో చాలా పురాతనమైన హిందూ దేవాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.
- Author : hashtagu
Date : 08-10-2022 - 7:08 IST
Published By : Hashtagu Telugu Desk
బంగ్లాదేశ్‌లో చాలా పురాతనమైన హిందూ దేవాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. జెనైదా జిల్లా దౌతియా గ్రామంలోని కాళీ ఆలయ అధికారులు శుక్రవారం విగ్రహన్ని ద్వంసం చేసినట్లు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆలయ ప్రాంగణానికి కిలోమీటర్ దూరంలో దేవత తలను గుర్తించారు పోలీసులు. పురాతన కాలం నుంచి ఇక్కడ హిందూవులు పూజలు చేస్తున్నారు. బంగ్లాదేశలో ఇలాంటి ఘటనలు గతంలొ అనేకం వెలుగులోకి వచ్చాయి.
10 రోజుల దుర్గా పూజ పండుగ ముగిసిన 24 గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. దుర్గాపూజ ముగిసిన తర్వాత, నదీ ఘాట్‌లలో విజయదశమి సందర్భంగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. బంగ్లాదేశ్ పూజ ఉత్సవ్ పరిషత్ ప్రధాన కార్యదర్శి చందనాథ్ పొద్దార్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, “ఈ సంఘటన రాత్రి జెనైదా ఆలయంలో జరిగింది.” ఢాకా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ చాంద్‌నాథ్ పొద్దార్ ఈ సంఘటనను దురదృష్టకరమని అభివర్ణించారు. ఎందుకంటే 10 రోజుల దసరా సందర్భంగా దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగలేదు. కానీ కాళీ మాత ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేయడం దురదృష్టకరమన్నారు.