HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄World News
  • ⁄At Least 27 Killed In Colombia Landslide

Colombia landslide: కొలంబియాలో ఘోర ప్రమాదం.. 34 మంది మృతి

కొలంబియాలో ఘోర ప్రమాదం జరిగింది.

  • By Gopichand Published Date - 07:55 AM, Tue - 6 December 22
Colombia landslide: కొలంబియాలో ఘోర ప్రమాదం.. 34 మంది మృతి

కొలంబియాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని బొగోటాకు 230 కి.మీల దూరంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి ఓ బస్సు మీద పడ్డాయి. ఈ దుర్ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. రిసరాల్డా ప్రావిన్సులోని ని ప్యూబ్లో రికో, శాంటా సిసిలియా గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. కేవలం 5 మందిని మాత్రమే ప్రాణాలతో కాపాడగలిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

కొలంబియాలో కొండచరియలు విరిగిపడటంతో 27 మంది చనిపోయారు. కొండచరియలు విరిగిపడడాన్ని ధృవీకరిస్తూనే ఈ కొండచరియలు విరిగిపడటంతో కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోయారని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలియజేశారు. కొలంబియా రాజధాని బొగోటాకు దాదాపు 230 కిమీ (140 మైళ్లు) దూరంలో ఉన్న రిసరాల్డా రాష్ట్రంలోని ప్యూబ్లో రికో, శాంటా సిసిలియా గ్రామాల మధ్య భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.

కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్ర రహదారి దెబ్బతింది. ఇందులో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురించి ప్రెసిడెంట్ పెట్రో ట్విట్టర్‌లో ఇలా వ్రాశారు. రిసారాల్డాలోని ప్యూబ్లో రికోలో జరిగిన విషాదంలో ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారని నేను విచారంగా చెప్పాల్సి వచ్చింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. బాధితులను ఆదుకుంటామని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను నగరంలోని స్టేడియానికి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో కేవలం ఐదుగురిని మాత్రమే రక్షించగలిగామని అధికారులు తెలిపారు. 2022 సంవత్సరంలో కొలంబియాలో భారీ వర్షాలకు సంబంధించిన సంఘటనలలో ఇప్పటివరకు 216 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు చెప్తున్నాయి. అదే సమయంలో.. దీని కారణంగా 38 వేల మంది నిరాశ్రయులయ్యారు. దేశవ్యాప్తంగా ఇంకా 48 మంది గల్లంతైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Telegram Channel

Tags  

  • 27 Dead
  • Bogota
  • colombia
  • Colombia landslide
  • landslide
  • President Gustavo Petro
  • world news

Related News

North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ ఎక్కడ ఉన్నారు..? ఆయనకు ఏమైంది..?

North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ ఎక్కడ ఉన్నారు..? ఆయనకు ఏమైంది..?

ఉత్తర కొరియా (North Korea) నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. భారీ సైనిక కవాతుకు ముందు కిమ్ జాంగ్ అదృశ్యమైనట్లు సమాచారం. ఈ వారం ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో సైనిక కవాతు జరగనుంది. కిమ్ జోంగ్ దీనికి హాజరు కావాల్సి ఉంది.

  • Wikipedia: వికీపీడియాపై నిషేధం ఎత్తివేసిన పాకిస్థాన్‌

    Wikipedia: వికీపీడియాపై నిషేధం ఎత్తివేసిన పాకిస్థాన్‌

  • Landslides in Southern Peru: కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం

    Landslides in Southern Peru: కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం

  • North Korean Balloon: దక్షిణ కొరియా గగనతలంలో ఉత్తర కొరియా బెలూన్.. అసలు విషయం ఇదే..!

    North Korean Balloon: దక్షిణ కొరియా గగనతలంలో ఉత్తర కొరియా బెలూన్.. అసలు విషయం ఇదే..!

  • Over 3,800 Killed: టర్కీలో భారీ భూకంపం.. 3800లకు చేరిన మృతుల సంఖ్య

    Over 3,800 Killed: టర్కీలో భారీ భూకంపం.. 3800లకు చేరిన మృతుల సంఖ్య

Latest News

  • Pawan Kalyan: అన్నయ్య చిరంజీవి రివాల్వర్ తో కాల్చుకోవాలనుకున్నా: పవన్ కళ్యాణ్

  • Capital AP : విశాఖ‌కు ఆర్బీఐ త‌ర‌లింపు? శ‌ర‌వేగంగా రాజ‌ధాని హంగులు!

  • AP Debts: ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ. 4,42,442 కోట్లు : తేల్చేసిన కేంద్రం

  • Kumbha Sankranti: కుంభ సంక్రాంతి వస్తోంది.. సూర్య భగవానుని ఆశీర్వాదం అందుకోండి

  • Waltair Veerayya OTT: ఓటీటీలోకి వాల్తేరు వీరయ్య.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Trending

    • Top 10 Robots: 2023లో ప్రపంచాన్ని మార్చే 10 రోబోలు

    • Balakrishna : నోరు జార‌లేదు..వ‌క్రీక‌రించారు! చింతిస్తున్నా..మీ బాల‌య్య‌.!

    • PAN Card: ఆధార్ తో మీ పాన్ లింక్ అయ్యిందా..? ఇలా తెలుసుకోవచ్చు

    • Oppo Reno 8T: ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో రెనో 8టీ

    • Modi@1: మన మోడీ వరల్డ్ నంబర్ 1

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: