HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >America Is In Danger Of Recession

America : ఆర్థికమాంద్యం ముప్పులో అమెరికా!

America : అధ్యక్షుడు ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్ నిబంధనల ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశముందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు

  • Author : Sudheer Date : 11-03-2025 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
America Is In Danger Of Rec
America Is In Danger Of Rec

అమెరికా ఆర్థిక వ్యవస్థ (America Recession) మాంద్యం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా అమెరికా స్టాక్ మార్కెట్లు (US stock markets) భారీగా పతనమయ్యాయి. అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ప్రవేశపెట్టిన టారిఫ్ నిబంధనల ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశముందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాస్డాక్ ఇండెక్స్ ఒక్కరోజులోనే 4 శాతం క్షీణించింది. 2022 తర్వాత ఒకేరోజులో ఇంత పెద్ద నష్టాన్ని చూడడం ఇదే తొలిసారి.

Indiramma Houses Scheme : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో షాక్ ఇచ్చిన మంత్రి పొంగులేటి

ప్రముఖ టెక్ కంపెనీలైన టెస్లా, Nvidia, మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్ షేర్లు గణనీయంగా నష్టపోయాయి. ఈ స్టాక్ మార్కెట్ పతనం కారణంగా మొత్తం 1.9 ట్రిలియన్ డాలర్ల విలువైన సంపద ఆవిరైంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల మనోభావాలపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. స్టాక్ మార్కెట్ క్షీణతతో పాటు, వ్యాపార వృద్ధి మందగించడం, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం వంటి అంశాల వల్ల ఆర్థిక మాంద్యం ముప్పు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు 40%కి పెరిగాయని చెబుతున్నారు. వడ్డీ రేట్ల పెరుగుదల, ముడిచమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ వాణిజ్యలో అనిశ్చితి వంటి అంశాలు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పౌరులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతే, వినిమయం తగ్గి మార్కెట్లపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

Posani : నటుడు పోసానికి బెయిల్ మంజూరు

ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వచ్చే నెలలో వడ్డీ రేట్లను సమీక్షించనున్నట్లు సమాచారం. ప్రభుత్వం, ఆర్థిక నిపుణులు కలిసి ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచే మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే గ్లోబల్ మార్కెట్లపై అమెరికా స్టాక్ మార్కెట్ పతనం తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • danger of recession
  • Donald Trump
  • donald trump decisions

Related News

They are trying to assassinate me... Trump's shocking comments.

Donald Trump: నన్ను హత్య చేయాలని చూస్తోంది.. ట్రంప్‌ షాకింగ్ కామెంట్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ మరోసారి కుట్ర పన్నుతోందని అమెరికాను ఇజ్రాయెల్ హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సమాచారం ఇజ్రాయెల్ ఇటీవల పెంటగాన్‌కు అందించిన నిఘా నివేదికలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ట్రంప్‌ను లక్ష

  • Attack on Chabahar port after Trump's warning

    US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.

    Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

  • Highly Emotional Atmosphere

    Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

Latest News

  • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

  • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd