Posani : నటుడు పోసానికి బెయిల్ మంజూరు
Posani : ఆయనకు కోర్టు ఇద్దరు జామీన్‌లు మరియు రూ.10వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది
- By Sudheer Published Date - 10:17 PM, Mon - 10 March 25

సీనియర్ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali )కి నరసరావుపేట జిల్లా కోర్టు (Narasaraopet District Court) నుండి బెయిల్ (Bail) లభించింది. ఆయనకు కోర్టు ఇద్దరు జామీన్‌లు మరియు రూ.10వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో పోసానికి కొంత ఊరట లభించినప్పటికీ, ఇంకా కొన్ని కేసుల్లో బెయిల్ లభించకపోవడంతో ఆయన వెంటనే విడుదలయ్యే అవకాశం లేదు.
Inter Exams : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
పొలిటికల్ కామెంట్స్ చేయడంలో ఘాటైన వ్యాఖ్యలు చేసే పోసానిపై గతేడాది నవంబరులో కేసు నమోదైంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతోనే నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు న్యాయపరంగా కొనసాగుతూ వచ్చింది.
YummyBee : హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరించిన యమ్మీబీ
తాజా కోర్టు ఉత్తర్వులతో పోసాని కేసులో ఓ ముందడుగు పడినట్లు కనిపిస్తున్నా, మిగిలిన కేసుల్లో ఇంకా అతనికి బెయిల్ రాలేదు. దీంతో ఆయన త్వరగా విడుదలయ్యే పరిస్థితి లేదు. ఇకపోతే, ఈ ఘటన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. పోసానిపై దాడులు జరుగుతున్నాయని ఆయన అనుచరులు అంటుండగా, టీడీపీ వర్గాలు మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకున్నామని పేర్కొంటున్నాయి. దీనిపై మరింత వివరణ త్వరలోనే రావొచ్చని అంటున్నారు.