Indiramma Houses Scheme : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో షాక్ ఇచ్చిన మంత్రి పొంగులేటి
Indiramma Houses Scheme : అర్హులైనవారికి ఇళ్లు కేటాయించకుండా ఉండిపోతే క్షేత్రస్థాయిలో సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు
- Author : Sudheer
Date : 10-03-2025 - 10:36 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Houses Scheme) అమలులో పారదర్శకతను నిర్ధారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఈ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించి, అనర్హులకు ఇళ్లు మంజూరైనట్లు గుర్తిస్తే, నిర్మాణం ఏ దశలో ఉన్నా వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లు కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.
Bhupesh Baghel : మాజీ సీఎం ఇంట్లో IT రైట్స్
ఈ నేపథ్యంలో, గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. జనవరి మూడో వారంలో నిర్వహించిన గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను నిర్ధిష్ట విధానంతో చేపట్టాలని చెప్పారు. అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేసి, ఇళ్లను కేటాయించే ప్రక్రియలో పారదర్శకత ఉండాలని మంత్రి హితవు పలికారు.
Inter Exams : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
అలాగే, ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని మంత్రి సూచించారు. దరఖాస్తు సమర్పించినప్పుడే లబ్ధిదారుల అర్హతలను నిర్ధారించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైనవారికి ఇళ్లు కేటాయించకుండా ఉండిపోతే క్షేత్రస్థాయిలో సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ చర్యల ద్వారా నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని, ఇళ్ల పంపిణీలో అవకతవకలు ఎదురయ్యే అవకాశం తగ్గుతుందని మంత్రి తెలిపారు.