అమెరికా వద్ద కొత్త ఆయుధం..బయటపెట్టిన ట్రంప్
- Author : Vamsi Chowdary Korata
Date : 26-01-2026 - 10:34 IST
Published By : Hashtagu Telugu Desk
Donald Trump అమెరికా వెనెజువెలా పై దాడి చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ దాడిలో తాము ఒక రహస్య ఆయుధాన్ని వాడామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎట్టకేలకు ఆ ఆయుధం పేరును ఆయన వెల్లడించారు. వెనెజువెలా సైన్యాన్ని నిర్వీర్యం చేసేందుకు తమ బలగాలు ‘ది డిస్కాంబోబులేటర్’ (The Discombobulato) అనే ఆయుధాన్ని వాడినట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా దళాలు ఆ ఆయుధాన్ని ప్రయోగించగానే ప్రత్యర్థుల ఆయుధాలు పనిచేయలేదని ట్రంప్ తెలిపారు. దీని గురించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు తనకు అనుమతి లేదని ట్రంప్ చెప్పారు
ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. వెనెజువెలాలో ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో అమెరికా దళాలు ఈ రహస్య ఆయుధాన్ని ప్రయోగించాయని వివరించారు. తాము ‘ది డిస్కాంబోబులేటర్’ పరికరాన్ని ఆన్ చేయగానే, ప్రత్యర్థి సైన్యం వద్ద ఉన్న ఆయుధాలన్నీ ఒక్కసారిగా మొరాయించి వారి తుపాకులు పనిచేయలేదు, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోయాయి. సైనికులు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో పడిపోయారని వివరించారు. ఈ ‘డిస్కాంబోబులేటర్’ ఎటువంటి పేలుళ్లు సంభవించకుండా, ప్రాణనష్టం జరగకుండానే శత్రువును లొంగదీసుకోగలదని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి