Militant Attack in Somalia: హోటల్‌పై ఉగ్రవాదుల దాడి.. తొమ్మిది మంది మృతి
సోమాలియాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. రాధాని మొదగిషుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్మయో నగరంలోని ఓ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.
- Author : Hashtag U
Date : 24-10-2022 - 11:06 IST
Published By : Hashtagu Telugu Desk
సోమాలియాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. రాధాని మొదగిషుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్మయో నగరంలోని ఓ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. తొలుత పేలుడు పదార్థాలతో నింపిన కారుతో తవక్కల్ హోటల్ గేటును ఢీకొట్టి ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం హోటళ్లోకి ప్రవేశించిన సాయుధులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో తొమ్మిది మరణించగా, మరో 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో నలుగురు భద్రతా సిబ్బంది, విద్యార్థులు ఉన్నట్లు సెక్యూరిటీ మినిస్టర్ యూసుఫ్ హుస్సేన్ ధుమాల్ వెల్లడించారు.
BREAKING: Suspected Al Shabab militants attack Tawakal Hotel in Kismayu. Police statement indicates gunfire still ongoing in the precinct. #Kismayu #Somalia pic.twitter.com/ydOyxykrkh
— Kulan Post (@kulanpost) October 23, 2022