9 Children Died : ల్యాండ్‌మైన్‌తో ఆడుకున్నారు.. పేలడంతో 9 మంది పిల్లల మృతి
9 Children Died : మందుపాతర పేలిన ఘటనలో 9మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.
- Author : Pasha
Date : 01-04-2024 - 3:36 IST
Published By : Hashtagu Telugu Desk
9 Children Died : మందుపాతర పేలిన ఘటనలో 9మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్ల కిందటి ల్యాండ్ మైన్‌తో పిల్లలు ఆడుకుంటుండగా.. అది అకస్మాత్తుగా పేలడంతో ఘోరం జరిగింది. ఈ భారీ పేలుడులో చనిపోయిన వారిలో ఐదుగురు బాలికలు ఉండగా, నలుగురు బాలురు(9 Children Died) ఉన్నారు. వీరంతా నాలుగేళ్ల నుంచి పదేళ్లలోపు వారే కావడం గమనార్హం. ఈ విషాదం ఆప్ఘనిస్థాన్‌లోని గజ్ని ప్రావిన్స్‌లో ఉన్న గేరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలను ఆఫ్ఘనిస్తాన్ సమాచార, సాంస్కృతిక శాఖ ప్రాంతీయ అధిపతి హమీదుల్లా నిసార్ వెల్లడించారు. రష్యా దండయాత్ర సమయంలో మిగిలిపోయిన ల్యాండ్ మైన్‌తో పిల్లలు ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
- గత ఆదివారం కూడా ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్ ప్రావీన్సులో గ్రనేడ్లు పేలడంతో ఓ చిన్నారి చనిపోయింది. మరో ఐదుగురు గాయపడ్డారు.
- 1979లో సోవియట్ దండయాత్ర, ఆ తర్వాత దశాబ్దాల తరబడి జరిగిన అంతర్యుద్ధం వల్ల ఆప్ఘనిస్తాన్ అతలాకుతలం అయింది.
- అప్పట్లో పేలని గ్రనేడ్లు, ల్యాండ్ మైన్స్‌ను డీయాక్టివేట్ చేయకుండా అలాగే వదిలేశారు.
- అలా వదిలేసిన గ్రనేడ్లు, ల్యాండ్ మైన్సే ఇప్పుడు పేలుతూ మరణాలకు కారణం అవుతున్నాయి.
Also Read :Congress : మొన్న బిహార్ పార్టీ.. ఇవాళ పంజాబ్ పార్టీ.. కాంగ్రెస్‌లో విలీనం
నాటి గాంధార రాజ్యమే నేటి ఆఫ్ఘనిస్తాన్ ?
మహాభారత కాలంలోని గాంధార రాజ్యమే నేటి ఆఫ్ఘనిస్తాన్ అని చాలామంది అంటారు. దీనికి రుజువు ఇదిగో అంటూ ఆ దేశంలోని ఒక నగరాన్ని ఇప్పటికీ కాందహార్ అని పిలుస్తారు. ఈ పదం గాంధార నుంచి ఉద్భవించింది. దీని అర్థం ‘సువాసనల భూమి’. గాంధార సామ్రాజ్యంలో నేటి తూర్పు ఆఫ్ఘనిస్తాన్, ఉత్తర పాకిస్తాన్, వాయువ్య పంజాబ్ ఉన్నాయి. మహాభారతం వేదవ్యాస మహర్షి రచించిన సంస్కృత ఇతిహాసం. ఇందులో కౌరవ, పాండవ యువరాజుల మధ్య జరిగిన యుద్ధ కథ. ఈ ఇతిహాసం ప్రకారం సుమారు 5500 సంవత్సరాల క్రితం గాంధారాన్ని సుబల రాజు పరిపాలించాడు.