Colarado Attack : అమెరికాపై ఉగ్రవాదుల పంజా..మాల్ పై దాడి
Colarado Attack : ఓ వ్యక్తి రెండు పెద్ద బాటిళ్లతో మాల్‌లోకి వచ్చి, అక్కడ సెలబ్రేషన్ లో పాల్గొన్న పాలస్తీనియా సముదాయంపై కెమికల్ తో కూడిన ఫైర్ బాంబులను విసరడం చూడవచ్చు
- By Sudheer Published Date - 11:08 AM, Mon - 2 June 25

అమెరికాలోని కొలరాడో(Colarado )లో మరోసారి ఉగ్రవాద పంజా విసిరింది. బౌల్డర్‌లోని పెరల్ స్ట్రీట్ మాల్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 1:26 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఓ వ్యక్తి రెండు పెద్ద బాటిళ్లతో మాల్‌లోకి వచ్చి, అక్కడ సెలబ్రేషన్ లో పాల్గొన్న పాలస్తీనియా సముదాయంపై కెమికల్ తో కూడిన ఫైర్ బాంబులను విసరడం చూడవచ్చు. దాడిలో గాయపడిన వారిలో కొందరికి తీవ్రమైన కాలిన గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు ప్రాణనష్టం ఎవరికి జరగలేదని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనను ఉగ్రదాడిగా భావిస్తూ ఎఫ్బీఐ దర్యాప్తు ప్రారంభించింది. దాడికి పాల్పడిన వ్యక్తిని మహ్మద్ సబ్రీ సోలిమన్ (45)గా గుర్తించారు. ఈయన ఇజ్రాయెల్ మద్దతుదారుడిగా భావిస్తున్నారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల కోసం తనదైన రీతిలో డిమాండ్ చేస్తూ ఈ దాడికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఇంతకు ముందు ‘రన్ ఫర్ దెయిర్ లైవ్స్’ పేరుతో నిర్వహించిన ర్యాలీలో కూడా ఈయన పాల్గొన్నట్లు బౌల్డర్ పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్ ఫియర్న్ తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించామని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై కొలరాడో గవర్నర్ జారెడ్ పోలిస్ స్పందిస్తూ.. గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ద్వేషపూరిత చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాల్సిందిగా అధికారులకు ఆదేశించామని చెప్పారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ కేసులో భాగస్వామ్యం కావడం, దాడిని ఉగ్రవాద చర్యగా పరిగణించడం సీరియస్ పరిణామం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
🚨 After trying to burn Jews alive in Boulder, Colorado today, Mohamad Soliman ranted about “children being killed” and “Until Palestine is free.”
You read that right.
He firebombed Jews—then played the victim.
This is the twisted ideology of Palestinianism:
Attack Jews, then… pic.twitter.com/Rx9QmtMTar— Jews Fight Back 🇺🇸🇮🇱 (@JewsFightBack) June 1, 2025