US Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురు భారతీయ విద్యార్థులు దుర్మరణం..మరో 5గురికి తీవ్రగాయాలు..!!
- By hashtagu Published Date - 06:51 AM, Fri - 28 October 22

అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ మసాచూసెట్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మరణించారు. వారు ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రేమ్ కుమార్ రెడ్డి (27) పావని గుళ్లపల్లి (22)సాయి నరసింహా పాటం శెట్టి (22) అక్కడిక్కడే మరణించినట్లు బెర్క్ షైర్ జిల్లా కార్యాలయం గురువారం తెలిపింది.
మాసాచుసెట్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో ముగ్గురు విద్యార్థులు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఈ ఘటన తెల్లవారు జామున 5:30 సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు 23 ఏళ్ల లోపు వారే. మనోజ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, విజిత్ రెడ్డి, హిమ ఈశ్వర్యసిద్దిరెడ్డి లను ఆసుత్రికి తరలించారు. వీరంతా లా ఎన్ ఫోర్స్ మెంట్ అంతర్జాతీయ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. ఆరుగురు న్యూ హెవెన్ యూనివర్సిటీ విద్యార్థులుగా గుర్తించారు.