HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >2000 Us Toops Will Be Deployed At Gaza Border To Help Israel

US Army – Gaza Border : అమెరికా సంచలన నిర్ణయం.. ఇజ్రాయెల్ కు 2వేల మంది సైనికులు

US Army - Gaza Border : ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది.

  • Author : Pasha Date : 17-10-2023 - 8:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Us Army Gaza Border
Us Army Gaza Border

US Army – Gaza Border : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ కు మద్దతుగా 2వేల మంది అమెరికా సైనికులను ఇజ్రాయెల్ బార్డర్ ఏరియాలలో మోహరిస్తామని ప్రకటించింది. ప్రత్యేకించి లెబనాన్, ఈజిప్ట్, సిరియా, గాజాతో ఉన్న ఇజ్రాయెల్ బార్డర్ లో అమెరికా దళాలు ఉంటాయని అంటున్నారు. అమెరికా తన సైనికుల సంఖ్యను మరింత పెంచే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇజ్రాయెల్ కు బయలుదేరేందుకు రెడీ కావాలంటూ ఇప్పటికే 2వేల మందికిపైగా సైనికులకు అమెరికా రక్షణశాఖ ఆదేశాలు జారీ చేసిందని సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

బుధవారం ఇజ్రాయెల్ లో బైడెన్ పర్యటన

మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం రోజు ఇజ్రాయెల్ కు పర్యటించనున్నారు. హమాస్ దాడితో జరిగిన నష్టంపై ఇజ్రాయెల్ కు నైతిక మద్దతును ప్రకటించేందుకు ఆయన ఆ దేశంలో పర్యటించనున్నారు. హమాస్ ను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ కు పూర్తిగా సహకరిస్తామని బైడెన్ అంటున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ పర్యటన సోమవారం రాత్రి ముగిసింది. ఈనేపథ్యంలో వెంటనే జో బైడెన్ ఇజ్రాయెల్ పర్యటనపై ప్రకటన విడుదల కావడం గమనార్హం. పాలస్తీనియన్ల భవిష్యత్తుపై అక్టోబర్ 21న ఈజిప్టులో జరగనున్న అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశంలో బైడెన్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే గాజా అంశంపై  ఐక్యరాజ్యసమితితో పాటు జోర్డాన్, పాలస్తీనా అథారిటీ, ఇజ్రాయెల్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసితో బైడెన్ ఫోన్ లో సంభాషించారు. గాజాకు మానవతా సాయం అందేలా చూడాలని ఇజ్రాయెల్ ను కోరారు. గాజాలోకి చొరబడి అక్కడే ఉండిపోవాలనే ఆలోచన ఉంటే విరమించుకోవాలని ఇజ్రాయెల్ కు కూడా ఆయన సూచించారు.

Also Read: Gay Marriage : సేమ్ సెక్స్ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తారా ? ‘సుప్రీం’ తీర్పు నేడే

గాజాలో దారుణ పరిస్థితులు

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో మరణించిన సామాన్య పాలస్తీనా పౌరుల సంఖ్య 3వేలు దాటింది. దాదాపు 11వేల మందికిపైగా గాయాలపాలయ్యారు. ఎంతో మంది పరిస్థితి విషమంగా ఉంది. నీరు, నిత్యావసరాలు లేక గాజావాసులు (US Army – Gaza Border) అల్లాడుతున్నారు. అయినా గాజా సీజ్ ను ముగించేది లేదని, నిత్యావసరాలను గాజాలోకి వెళ్లనివ్వబోమని ఇజ్రాయెల్ అంటోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2000 US Troops
  • Gaza Border
  • Hamas
  • Hezbollah Vs Israel
  • Israel.
  • Palestine
  • Pentagon
  • US Army - Gaza Border

Related News

Us Iran Attack

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

Donald Trump మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందంపై జరిగిన చర్చలు విఫలం కావడంతో, సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ వారాంతంలోనే ఇరాన్‌పై దాడులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల కోసం సైన్యం ఎదురుచూస్తోందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అమెరికా తన వైమానిక, నౌకా దళాలను పెద్ద ఎత్త

  • Benjamin Netanyahu

    ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్స‌ర్‌.. నిజ‌మేనా?!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd