Cylinder Blast: రైలులో పేలిన సిలిండర్.. ఇద్దరు మృతి
పాకిస్థాన్‌లో గురువారం ఉదయం రైలులో సిలిండర్ పేలుడు (Cylinder Blast) సంభవించిన హృదయ విదారక వార్త వెలుగులోకి వచ్చింది. బలూచిస్థాన్‌లోని క్వెట్టా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం.
- By Gopichand Published Date - 01:58 PM, Thu - 16 February 23

పాకిస్థాన్‌లో గురువారం ఉదయం రైలులో సిలిండర్ పేలుడు (Cylinder Blast) సంభవించిన హృదయ విదారక వార్త వెలుగులోకి వచ్చింది. బలూచిస్థాన్‌లోని క్వెట్టా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం. దీని తాకిడికి ఇద్దరు చనిపోయారు. అదే సమయంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. పెషావర్ నుంచి క్వెట్టా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ చిచావత్నీ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తుండగా పేలుడు సంభవించింది.
స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. పెషావర్ నుంచి క్వెట్టా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ చిచావత్నీ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తుండగా పేలుడు సంభవించింది. ఎకానమీ క్లాస్‌లోని 6వ నంబర్ బోగీలో పేలుడు జరిగినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే పేలుళ్లకు గల కారణాలు ఇంకా నిర్ధారించబడలేదు. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
Also Read: Terrorist Killed: కుప్వారాలో పాక్ ఉగ్రవాది హతం
గత నెల ఈ రైలులో ఇటువంటి పేలుడు ఒకటి జరిగింది. ఇందులో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లోని రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఉగ్ర కోణం ఉందేమోనని అనుమానిస్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఉగ్రవాద వ్యతిరేక శాఖ అధికారులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రైలు, ట్రాక్ మొత్తాన్ని పరిశీలించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఆధారాలను సేకరిస్తున్నారు.