Famous Youtuber: 300 kmph బైక్ ప్రమాదంలో యూట్యూబర్ మృతి
అతివేగం నిండు ప్రాణాన్ని బలిగొంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావట్లేదు.
- Author : Praveen Aluthuru
Date : 05-05-2023 - 3:40 IST
Published By : Hashtagu Telugu Desk
Famous Youtuber: అతివేగం నిండు ప్రాణాన్ని బలిగొంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావట్లేదు.
ప్రో-రైడర్ 1000 పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్న 23 ఏళ్ల ఆగస్టే డెహ్రాడూన్‌లో నివసిస్తున్నాడు. ఆయన యూట్యూబ్ ఛానెల్‌లో 12.40 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. విన్యాసాలు, అతి వేగంతో ప్రయాణించడం వంటి వాటిని వీడియో తీసి తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసేవాడు. తాజాగా బైక్ నడుపుతూ యూట్యూబ్‌లో వీడియోలు తీస్తున్నాడు. ఓవర్‌స్పీడ్‌లో బైక్ నడపడం వల్ల బ్యాలెన్స్ తప్పడంతో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నింజా బైక్ పై గంటకు 300 కిలోమీటర్ల స్పీడ్ లో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఆగస్టే అక్కడికక్కడే మృతి చెందాడు.
అగస్టే తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆగ్రా నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. యూపీలోని అలీగఢ్ జిల్లాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుమారుడి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. అగస్టే రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు బంగారు పతకాన్ని సాధించాడు. మార్చి 2022న ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని రెండు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. అంతే కాకుండా రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్, జాతీయ స్థాయి ఆర్మ్ రెజ్లింగ్ పోటీల్లో పలుమార్లు బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించాడు. అతని తండ్రి జితేంద్ర చౌహాన్ సీనియర్ విభాగంలో జాతీయ ఛాంపియన్ గోల్డ్ మెడలిస్ట్.
Read More: Massage Centers: అమ్మాయిలతో మసాజ్ చేయిస్తూ.. పోలీసులకు దొరికిపోయి!