Viral Video : నడిరోడ్డుపై బైక్ నడుపుతూ ముద్దులతో రెచ్చిపోయిన యువతులు..
ఇద్దరు యువతులు నడుస్తున్న బైక్ పై ఎదురెదురుగా కూర్చుని ముద్దు పెట్టుకుని, హగ్ చేసుకున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
- By News Desk Published Date - 10:00 PM, Fri - 5 May 23

ఇటీవల నడిరోడ్డుపై వెళ్లే బైక్(Bike) లపై లవర్స్ అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోలు(Videos) చాలానే వెలుగులోకి వచ్చాయి. బాయ్ ఫ్రెండ్ బైక్ నడుపుతుంటే.. బైక్ ట్యాంక్ పై యువతి కూర్చుని గట్టిగా హగ్ చేసుకోవడం, నలుగురూ చూస్తున్నారన్న విచక్షణ లేకుండా ముద్దులు పెట్టుకోవడం, అంతకు మించి అన్నట్లుగా ప్రవర్తించడం ఇలాంటి దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.
కానీ.. ఈసారి ఇద్దరు యువతులు నడుస్తున్న బైక్ పై ఎదురెదురుగా కూర్చుని ముద్దు పెట్టుకుని, హగ్ చేసుకున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బైక్ రిజిస్టర్ అయిన నంబర్ ను బట్టి ఈ వీడియోను తమిళనాడులో తీసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను జార్ఖండ్ స్టార్స్ అనే ఇన్ స్టా ఐడీ ద్వారా పోస్ట్ చేశారు. కదులుతున్న బైక్ పై హ్యాండిల్ వదిలేసి ఇద్దరు యువతులు కరినొకరు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
బహుశా ఇద్దరు యువతులు ఇలాంటి వీడియో చేయడం ఇదే మొదటి సారి కావొచ్చు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవగా.. ఆ ఇద్దరు యువతులపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ తరహా బైక్ విన్యాసాలు గతంలో నిషేధింపబడినా.. మళ్లీ అలాంటి విన్యాసాలను ప్రోత్సహించేలా వీడియో తీయడంపై, అది కూడా ఇద్దరు అమ్మాయిలు తీయడంపై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Viral Video: పొలంలో హార్వెస్టర్ యంత్రంపై మొసలి దాడి.. వైరల్ అవుతున్న వీడియో..!