Viral : గాల్లో ఉండగానే ఊడిపోయిన స్పైస్ జెట్ ఫ్లైట్ విండో..
Viral : గోవా నుంచి పుణేకు బయలుదేరిన స్పైస్‌జెట్ Q400 విమానంలో గాల్లో ఉండగానే ఒక విండో ఫ్రేమ్ ఊడిపోవడం
- By Sudheer Published Date - 07:41 AM, Thu - 3 July 25

విమాన ప్రయాణం (Air Travel) అంటేనే ఖంగారు పడే రోజులు వచ్చాయి. ఏ విమానం ఎక్కడ కూలుతుందో..ఎక్కడ మంటలు వస్తాయో..క్షేమంగా ఇంటికి చేరుకుంటామో లేదో ..అనే అనుమానాలు విమాన ప్రయాణికుల్లో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత కొద్దీ రోజులుగా ప్రతి రోజు ఎక్కడో ఓ చోట విమాన కూలిన ఘటన , విమానంలో సాంకేతిక లోపం ఇలా ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంది. దీంతో ప్రయాణికుల్లో భయం నెలకొంది. ఇలాంటి ఈ సమయంలో తాజాగా స్పైస్‌జెట్ విమానం(SpiceJet Flight)లో జరిగిన ఘటన మరోసారి విమానయాన సంస్థల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తింది. గోవా నుంచి పుణేకు బయలుదేరిన స్పైస్‌జెట్ Q400 విమానంలో గాల్లో ఉండగానే ఒక విండో ఫ్రేమ్ ఊడిపోవడం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. విమానంలో ప్రయాణిస్తున్న వారు ఈ ఘటనను వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ DGCAను ట్యాగ్ చేసి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.
Kavitha – KTR : కేటీఆర్ తో మీరు క్లోజ్ గా ఉంటారా..? కవిత చెప్పిన సమాధానం ఇదే !
ఈ ఘటనతో ప్రయాణికుల్లో భద్రతపై భయానక అనుభవం చోటుచేసుకుంది. విమాన సేవలపై ఇప్పటికే నమ్మకం తగ్గిన వేళ, ఇటువంటి సంఘటనలు వారి ఆందోళనను మరింత పెంచుతున్నాయి. విమాన సంస్థలు భద్రతా ప్రమాణాలను తక్కువ చేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. విమానంలో ఎమర్జెన్సీ ఏర్పడినపుడు ఏం జరుగుతుందనే ప్రశ్నలు కూడా ఈ ఘటనతో మళ్లీ తెరపైకి వచ్చాయి.
Shubman Gill: తొలి రోజు ముగిసిన ఆట.. గిల్ సూపర్ సెంచరీ, భారత్ స్కోర్ ఎంతంటే?
ఈ అంశంపై స్పందించిన స్పైస్‌జెట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. “Q400 ఎయిర్‌క్రాఫ్ట్‌లో విండో ఫ్రేమ్ ఊడిపోయింది. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానం భద్రంగా ల్యాండ్ అయిన వెంటనే సమస్యను సరిచేశాం,” అని తెలిపింది. అయినప్పటికీ, ప్రయాణికుల భద్రతను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసం అనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. DGCA ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.