Kavitha – KTR : కేటీఆర్ తో మీరు క్లోజ్ గా ఉంటారా..? కవిత చెప్పిన సమాధానం ఇదే !
Kavitha - KTR : గత కొద్దీ రోజులుగా తెలంగాణ లో కవిత ఇష్యూ హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. కేటీఆర్ తో విభేదాలు ఏర్పడ్డాయని
- By Sudheer Published Date - 07:34 AM, Thu - 3 July 25

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కవిత (Kavitha) తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత కొద్దీ రోజులుగా తెలంగాణ లో కవిత ఇష్యూ హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. కేటీఆర్ తో విభేదాలు ఏర్పడ్డాయని , ఇది ఆస్తుల కోసం , అలాగే పదవుల కోసం అనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా కేటీఆర్ పై పరోక్షం ఆమె ట్వీట్స్ చేయడం కూడా వార్తల్లో నిలిచేలా చేసాయి. త్వరలోనే ఈమె కొత్త పార్టీ పెట్టబోతుందనే ప్రచారం సైతం మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కేటీఆర్ తో విభేదాలు , ఆయనతో సాన్నిహిత్యం వంటి విషయాలను పంచుకున్నారు.
Shubman Gill: తొలి రోజు ముగిసిన ఆట.. గిల్ సూపర్ సెంచరీ, భారత్ స్కోర్ ఎంతంటే?
తన తండ్రి కేసీఆర్ కంటే తమ్ముడు కేటీఆర్‌తోనే ఎక్కువగా క్లోజ్‌గా ఉంటానని ఆమె చెప్పడం విశేషంగా మారింది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటీవల కవిత రాసిన లేఖ బయటకు వచ్చిన తర్వాత, ఆమె మరియు కేటీఆర్ మధ్య కొంత రాజకీయ దూరం పెరిగిందన్న వార్తలు చర్చకు వచ్చింది. అయితే, వ్యక్తిగతంగా మాత్రం తమ ఇద్దరిమధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని ఆమె స్పష్టం చేశారు.
కవిత మాట్లాడుతూ.. “తాత్కాలికంగా కొన్ని అభిప్రాయ భేదాలు రావొచ్చు కానీ కుటుంబంగా మేమంతా ఒకటే. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. కానీ, వ్యక్తిగతంగా మేము చాలా దగ్గరగా ఉంటాము. నేను ఇప్పటికీ కేటీఆర్‌తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాను” అని అన్నారు. అంతేకాకుండా, తాను రాజకీయంగా ఎవరిని ఫాలో అవుతానన్న ప్రశ్నకు కవిత క్లారిటీ ఇచ్చారు.
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారట!
“నాకు ఎప్పటికీ నా లీడర్ కేసీఆర్‌గారే. ఆయన తర్వాత పార్టీలో లీడర్షిప్ పెరిగిందా అంటే, ఇప్పటికీ ఆయన స్థాయిలో ఎవరూ ఎదగలేదని నా అభిప్రాయం,” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో పాటు కవిత బీఆర్ఎస్ భవిష్యత్, లోపలి పరిస్థితులపై తన దృక్పథాన్ని సున్నితంగా తెలియజేశారు. ఆమె మాటలు చూసినవారికి కేసీఆర్ వారసత్వంలో లీడర్షిప్‌ను ఎవరు తీసుకుంటారన్న చర్చలు మరింత ఊపందుకుంటున్నాయి.