Online Food Order : GST దెబ్బ.. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేవారి జేబులకు చిల్లు
Online Food Order : ఈ పెంపుదల ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలపై ఆధారపడినవారికి ఇబ్బందికరంగా మారనుంది. ఇప్పటికే ధరల పెరుగుదల, డెలివరీ ఛార్జీల పెంపుతో సతమతమవుతున్న వారికి ఈ కొత్త జీఎస్టీ మరింత భారం కానుంది
- By Sudheer Published Date - 12:17 PM, Mon - 8 September 25

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ (Online Food Order ) చేసేవారికి ఇది ఒక చేదు వార్త. ఇప్పటికే స్విగ్గీ, జొమాటో (Zomato & Swiggy) వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు డెలివరీ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 22 నుంచి డెలివరీ ఛార్జీలపై 18 శాతం జీఎస్టీ (వస్తువులు మరియు సేవల పన్ను) అమలులోకి రానుంది. ఈ కొత్త పన్ను కారణంగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లపై మరింత ఆర్థిక భారం పడనుంది.
Gold Price : దిగొచ్చిన బంగారం ధరలు
ఈ జీఎస్టీ ప్రభావం కారణంగా జొమాటో సంస్థ ఒక్కో ఆర్డర్‌కు అదనంగా రూ.2 వసూలు చేసే అవకాశం ఉంది. అదే విధంగా, స్విగ్గీ కూడా ప్రతి ఆర్డర్‌కు రూ.2.6 చొప్పున అదనంగా వసూలు చేయవచ్చని సమాచారం. ఈ డెలివరీ ఛార్జీలపై అదనంగా జీఎస్టీ విధించడంతో వినియోగదారుల జేబులకు మరింత చిల్లు పడనుంది.
ఈ పెంపుదల ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలపై ఆధారపడినవారికి ఇబ్బందికరంగా మారనుంది. ఇప్పటికే ధరల పెరుగుదల, డెలివరీ ఛార్జీల పెంపుతో సతమతమవుతున్న వారికి ఈ కొత్త జీఎస్టీ మరింత భారం కానుంది. ఇది ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ల సంఖ్యపై ప్రభావం చూపవచ్చు, తద్వారా ఈ రంగంలో అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితి డెలివరీ అగ్రిగేటర్లు మరియు వినియోగదారులకు ఇద్దరికీ సవాళ్లను సృష్టిస్తోంది.