Phone Free: మీరు కీరాక్ మీమ్స్ చేస్తారా, అయితే ఫ్రీగా ఫోన్ ని పొందే ఈ బంపర్ ఆఫర్ మీకే!
- By Anshu Published Date - 10:06 PM, Fri - 16 December 22

Phone Free: మీకు మీమ్స్ చేయడం అంటే ఇష్టమా, అయితే ఇంకెందుకు ఆలస్యం మీలో ఉన్న క్రియేటివిటీని బయటపెట్టి ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేయండి. ఉత్తమ మీమ్స్ కు బదులుగా నథింగ్ వన్ ఫోన్ ను పొందండి. ఇదేదో కంపెనీ మార్కెటింగ్ యాడ్ లాగా అనిపిస్తుందా? వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం.నథింగ్ వ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు.
ఆయన తన ట్విట్టర్ ఖాతాలో “రాబోయే 24 గంటల్లో నాకు నచ్చిన ఉత్తమమైన మీమ్స్ నథింగ్ వన్ ఫోన్ ను గెలుచుకునే అవకాశం పొందుతాయి”అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ విడుదలైన వెంటనే కొన్ని వేల మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వినూత్నమైన మీమ్స్ ను అతని అకౌంట్ కి పంపించారు. అందరికీ భిన్నంగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కార్ల్ పెయి కు పాన్ బేస్ బాగానే ఉంది.
2022 నుంచి ఈ నథింగ్ ఫోన్స్ మంచి పాపిలారిటీ సంపాదించాయి.కార్ల్ స్టార్ట్ అప్ గా ముందుకు వచ్చిన నథింగ్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన మొదటి ఫోన్ అయిన నథింగ్ వన్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఫెస్టివల్ ఆఫర్ కింద ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో భారీ డిస్కౌంట్ కి లభ్యమవుతోంది. అయితే మీరు ఈ ఫోన్ను పూర్తి ఉచితంగా పొందవచ్చు. దానికి కావలసిన వల్ల ఒక స్మార్ట్ ఫోన్ మరియు మంచి మీమ్స్ క్రియేట్ చేసే సృజనాత్మకత. క్రిస్మస్ సందర్భంగా నథింగ్ సీఈవో అయిన కార్ల్ పెయి శాంటా అవతారం ఎత్తడానికి నిర్ణయించుకున్నట్లు ఉన్నాడు. అందుకే కాబోలు ఉత్తమమైన మీమ్స్ చేసి తనని మెప్పించిన వారికి స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. ఇటీవల లండన్‌లోని సోహోలో ఈ కంపెనీ మొదటి ఆఫ్‌లైన్ స్టోర్ ప్రారంభోత్సవంలో కూడా కంపెనీ తరఫున ఫ్రీ ప్రొడక్ట్స్ అందించారు.