Panipuri in Train : ట్రైన్‌లో పానీపూరి.. బిజినెస్ ఐడియా భలే ఉందే..
అద్భుతమైన ఐడియాస్ బిజినెస్ టైకూన్స్ కి మాత్రమే రావు, అందరికీ వస్తాయనటానికి ఈ పానీపూరీ వాలానే సాక్షి.
- By News Desk Published Date - 11:00 PM, Mon - 26 June 23

మనదేశంలో పానీ పూరీ(Panipuri)కి ఉన్నంత డిమాండ్ ఇంక దేనికి లేదు. ఇంతకుముందు ప్రాంతాన్ని బట్టి వేరు వేరు చిరు తిళ్ళు ఉండేవి. కానీ ఇప్పుడు అదేం లేదు. ఊరేదైనా గాని పానీపూరి బళ్ళు ఎక్కడ పెడితే అక్కడ కనబడతాయి. ఎంతగా అంటే ఏం చదువుకోకపోయినా సరే పానీ పూరి బండి పెట్టుకొని బతికేయచ్చు అన్నంత ధైర్యం వచ్చేలా. అయినా వ్యాపారానికి అస్సలు చదువుతూ సంబంధం లేదు, తెలివి ఉంటే చాలు, ఎక్కడ ఎలా చొచ్చుకుపోగలమో ఆలోచించి అడుగు వెయ్యటమే అసలైన వ్యాపార రహస్యం.
సరిగ్గా అలానే ఆలోచించి ఎంచక్కా ఓ పానీ పూరీ డబ్బా పెట్టుకున్నాడు ఓ యువకుడు. ఇక్కడ చెప్పుకోవాల్సినది ఏం పెట్టుకున్నాడు అన్నది కాదు. ఎక్కడ పెట్టుకున్నాడు అన్నది. ఎందుకంటే ఈ అబ్బాయి పెట్టుకున్న పానీపూరి స్టాల్ లొకేషన్ లోకల్ ట్రైన్(Local Train). అద్భుతమైన ఐడియాస్ బిజినెస్ టైకూన్స్ కి మాత్రమే రావు, అందరికీ వస్తాయనటానికి ఈ పానీపూరీ వాలానే సాక్షి. ప్రయాణికులు కూడా ఖాళీ కడుపుతో ఇంటికి వెళ్ళకుండా ఎంచక్కా అతని చుట్టూ నిలబడే పానిపూరీ తినేస్తున్నారు.
When you put your business mind on the right track pic.twitter.com/Wg3sQmEgpQ
— Sagar (@sagarcasm) June 21, 2023
ఇప్పుడు ఈ వీడియో ట్విట్టర్(Twitter) లో వైరల్ అవుతోంది. రైల్వే ట్రాక్ మీద వెళుతున్న ట్రైన్ లో పానీపూరి అమ్ముతున్నాడు కాబట్టి, బిజినెస్ ట్రాక్ లో ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు కొందరు. నిజంగా ఈ పానీపూరి బండిని చూడగానే మాములుగా రోడ్డు పక్కన ఉండే పానీపూరి చూశాం కానీ ఇలా ట్రైన్ లో అమ్మడం వెరైటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇది కోల్‌కతాలో అని సమాచారం. ఈ వీడియో ఓ నెటిజన్ షేర్ చేయగా వైరల్ గా మారింది. రైల్వే ట్రాక్ పై తన బిజినెస్ ని ట్రాక్ లో పెట్టుకుంటున్నాడు అని అంటున్నారు.
Also Read : World Ugliest Dog : వరల్డ్ అగ్లీయస్ట్ డాగ్.. చూశారా? అందం లేనందుకు లక్ష రూపాయల ప్రైజ్..