Bihar : వీడు మాములు బుడతడు కాదు..తాచుపామునే కొరికి చంపేశాడు
Bihar : గోవింద్ అనే ఏడాది వయసున్న బుడ్డోడు మాత్రం అందరి అంచనాలను తలకిందులుచేస్తూ ఓ విషపూరిత తాచుపామునే కొరికి చంపేశాడు
- By Sudheer Published Date - 08:01 AM, Sun - 27 July 25

బిహార్ రాష్ట్రంలోని బెటాయ్ గ్రామంలో ఒక అరుదైన, షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఏడాది వయస్సున్న పిల్లలు ఏ చిన్న శబ్దానికైనా భయపడి ఏడుస్తారు. కానీ గోవింద్ అనే ఏడాది వయసున్న బుడ్డోడు మాత్రం అందరి అంచనాలను తలకిందులుచేస్తూ ఓ విషపూరిత తాచుపామునే కొరికి చంపేశాడు. ఈ ఘటన గ్రామస్థులను, వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.
Sec-bad Test Tube Baby Center : ఆ వీడియోలు చూపిస్తూ స్పెర్మ్ సేకరణ
గోవింద్ తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక నాగుపాము అతని చేతికి చుట్టుకుంది. సాధారణంగా ఇలాంటి ఘటనలలో పిల్లలు భయపడతారు, కానీ గోవింద్ మాత్రం ఆ పామును ఆట వస్తువుగా భావించి దాన్ని కొరికి చంపేశాడు. పామును కొరికిన తర్వాత గోవింద్‌కు తలనొప్పి, జ్వరంలాంటి లక్షణాలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స అందించి, కొన్ని పరీక్షలు నిర్వహించారు. గోవింద్ విషం ప్రభావానికి లోనవకుండా బయటపడడం ఓ అద్భుతమేనని వైద్యులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గోవింద్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏడాది వయస్సులోనే ఒక బుడ్డోడు విషపూరిత తాచుపామును చంపడం ఊహించదగిన విషయమే కాదు. ఇది ఓ అదృష్టకర సంఘటనగా భావించాల్సిందే. పాము ఎంత ప్రమాదకరమైనదైనా కూడా చిన్నారి ధైర్యం ముందు నిలువలేకపోయిందని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.