HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Murder For Not Talking On The Phone Atrocious Incident

ఫోన్ మాట్లాడ్డం లేదని హత్య..దారుణ ఘటన

ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

  • By Anshu Published Date - 10:22 PM, Tue - 27 December 22
  • daily-hunt
9649f8ae08
9649f8ae08

ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 20 ఏళ్ల యువతి తనతో మాట్లాడట్లేదని ఓ వ్యక్తి ఆమెను 51 సార్లు స్క్రూ డ్రైవర్‌తో పొడిచి పొడిచి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కొర్బా జిల్లాలో ఈ నెల 24వ తేదీన ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లోని పంప్ హౌజ్ కాలనీలో ఈ హత్య జరిగినట్లు సిటీ ఎస్పీ విశ్వదీపక్ త్రిపాఠి మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఈ హత్యకు సంబంధించిన పలు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఘటన జరగడానికి ముందు బాధితురాలు ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటోందని, నిందితుడు ఆమె వద్దకు వచ్చి దారుణంగా ప్రవర్తించాడని తెలిపారు. బాధితురాలి నోటికి దిండును అడ్డుపెట్టి ఆమె అరుపులు బయటకు వినిపించకుండా చేశాడని, ఆ తర్వాత ఓ స్క్రూ డ్రైవర్‌తో ఆమెను చాలా దారుణంగా 51 సార్లు పొడిచి హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు.

బాధిత మహిళ సోదరుడు ఇంటికి రాగా అప్పటికే ఆమె రక్తపు మడుగులో చనిపోయి ఉంది. దీంతో ఆమె సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. నిందితుడు జశ్‌పూర్ జిల్లా వాడని, మూడేళ్ల క్రితం బాధితురాలితో అతనికి పరిచయం ఏర్పడినట్లు విచారణలో తేలింది. నిందితుడు బస్ కండక్టర్‌గా ఉన్నప్పుడు ఆమె ఆ బస్సులో ప్రయాణించేది. అప్పుడే వారి ఇరువురికి పరిచయం ఏర్పడింది.

నిందితుడు తన పని నిమిత్తం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లి అక్కడే ఉండేవాడు. అయితే వారిద్దరూ ఫోన్‌లోనే టచ్ లో ఉన్నాడు. కానీ కొన్ని రోజులుగా ఆమె తనతో మాట్లాడ్డం లేదని, ఆమెను ఆమె తల్లిదండ్రులను కూడా అతడు బెదిరించాడు. ఈ క్రమంలోనే నిందితుడు బాధితురాలని హత్య చేసి పరార్ అయ్యాడు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • murder
  • screw driver
  • viral

Related News

    Latest News

    • Cholesterol: కొలెస్ట్రాల్‌ను త‌గ్గించే ఆహార ప‌దార్థాలివే!

    • Maganti Sunitha Nomination : మాగంటి సునీత నామినేషన్ రద్దు చేయండి – ప్రద్యుమ్న

    • Diwali Sivakasi : శివకాశి రికార్డు.. రూ.7వేల కోట్ల బిజినెస్

    • Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!

    • New Scheme of RJD : మహిళలకు నెలకు రూ.30 వేలు.. RJD కొత్త పథకం

    Trending News

      • Ishan Kishan: ఐపీఎల్ 2026.. ఈ ఆట‌గాడి కోసం మూడు ఫ్రాంచైజీల పోటీ!

      • Sanju Samson: ఆర్సీబీలోకి సంజు శాంస‌న్‌.. ఇదిగో ఫొటో!

      • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

      • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

      • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd