Social Media Star: ప్రిన్సెస్ ఆఫ్ ది స్లమ్.. మురికివాడ నుంచి మోడలింగ్ దాకా!
ముంబైలోని మురికివాడ అయిన ధారావికి చెందిన 14 ఏండ్ల బాలిక మలీషా ఫ్యాషన్ ప్రపంచంలో దూసుకుపోతోంది.
- By Balu J Published Date - 06:09 PM, Mon - 22 May 23

సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు? ఎప్పుడు స్టార్ అవుతారో చెప్పలేం. మురికివాడల మధ్య బతికే ఓ అమ్మాయి మోడలింగ్ గా రాణిస్తుందంటే ఎవైరనా నమ్మగలరా? కానీ ఓ అమ్మాయి మాత్రం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ శభాష్ అనిపించుకుంటోంది. ముంబైలోని మురికివాడ అయిన ధారావికి చెందిన 14 ఏండ్ల బాలిక మలీషా ఫ్యాషన్ ప్రపంచంలో దూసుకుపోతోంది. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఫ్యాషన్ మోడల్‌గా మలీషాను ఎంచుకొని సరికొత్త అవకాశాలను కల్పించింది.
పాపులర్ స్కిన్ బ్రాండ్ మలీషా ముఖాన్ని ఎంచుకుని ప్రచారం చేయాలని నిర్ణయించడంతో ఫారెస్ట్ ఎసెన్షియల్స్ న్యూ క్యాంపెయిన్‌లో భాగంగా సెలెక్షన్స్‌లో మలీషా ఎంపికైంది. స్లమ్‌లో పుట్టిపెరిగిన మలీషా తన కలలు, ఆకాంక్షలకు రెక్కలు తొడిగిన తీరుతో తమ బ్రాండ్ ఫేస్‌గా మలీషాను ప్రవేశపెడుతున్నామని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
అంతేకాదు ఈ 14 ఏళ్ల అమ్మాయి హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించబోతోంది. మలీషా ఖర్వాను ‘ప్రిన్సెస్ ఆఫ్ ది స్లమ్’ అని కూడా పిలుస్తారు. తన జీవితంలో వచ్చిన కొత్త అవకాశాలపై ఆమె స్పందిస్తూ “నేను ప్రస్తుతం ఉన్న స్థితిలో చాలా సంతోషంగా ఉన్నాను. ప్రజలు నన్ను ఎక్కడో చూసినప్పుడు నన్ను గుర్తించే సందర్భాలు ఉన్నాయి” అంటూ రియాక్ట్ అయ్యింది. మలీషా ఖర్వాను 2020లో హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్‌మన్ ముంబైలో కనుగొన్నారు. అతను మలీషా కోసం గో ఫండ్ మీ పేజీని ఏర్పాటు చేశాడు. అప్పటి నుండి పాపురల్ అయ్యింది. ఆ తర్వాత మోడలింగ్ లో అడుగుపెట్టి ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
Also Read: Keerthy Suresh: సరైన సమయంలో నా మిస్టరీ మ్యాన్ ను పరిచయం చేస్తా: పెళ్లిపై కీర్తి సురేశ్ రియాక్షన్!