Mukesh Ambani Tears : కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ అంబానీ.. కొడుకు అనంత్ స్పీచ్ విని ఎమోషనల్
Mukesh Ambani Tears : ఎమోషన్.. ఎవ్వరికైనా ఒక్కటే. డబ్బులేని పేదవాడికైనా.. డబ్బులున్న ముకేశ్ అంబానీకైనా అది ఒక్కటే.
- Author : Pasha
Date : 02-03-2024 - 4:26 IST
Published By : Hashtagu Telugu Desk
Mukesh Ambani Tears : ఎమోషన్.. ఎవ్వరికైనా ఒక్కటే. డబ్బులేని పేదవాడికైనా.. డబ్బులున్న ముకేశ్ అంబానీకైనా అది ఒక్కటే. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్‌నగర్‌లో గ్రాండ్‌గా జరుగుతున్నాయి. అంతా సందడిగా సాగిపోతున్న ఈ వేడుకల్లో అనంత్ అంబానీ స్పీచ్ ఒక్కసారిగా అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. తన ఆరోగ్య సమస్యల గురించి అనంత్ మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు. ఆ టైంలో ముకేశ్ అంబానీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి 1న ప్రారంభమైన ఈ ఈవెంట్ మార్చి 3 దాకా కొనసాగనుంది. మొదటి రోజు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. పాప్‌సింగర్ రిహాన్నా షో ఈసందర్భంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ ఓ బాలీవుడ్ పాటకు యాక్టింగ్ చేసి అందరినీ అలరించారు.
We’re now on WhatsApp. Click to Join
అనంత్ అంబానీ స్పీచ్ ఇదీ..
‘‘నా ఫ్యామిలీ నన్ను చాలా స్పెషల్‌గా చూసింది. అయినా నా జీవితం పూలపాన్పు కానే కాదు. ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డాను. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. కానీ ఎల్లప్పుడూ మా అమ్మ, నాన్న అండగా నిలబడ్డారు. నాకు బాధ కలగకుండా ఉండేందుకు ఏమేం చేయాలో వాళ్లు అన్నీ చేశారు. ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్‌గా జరుగుతోందంటే అందుకు కారణం మా అమ్మే. ఈ ఈవెంట్ కోసం మా అమ్మ కొద్ది నెలలుగా రోజుకు 18 గంటల పాటు పని చేస్తోంది. ఆమె వల్లే ఇదంతా సాధ్యమైంది. థాంక్యూ అమ్మా’’ అని అనంత్ అంబానీ (Mukesh Ambani Tears) చెప్పుకొచ్చారు.
Also Read : Mumbai Terror Attack : ముంబై పేలుళ్ల సూత్రధారికి పాక్‌లో ఏమైందంటే..
ఈ ఈవెంట్‌కు ప్రపంచంలోని అత్యంత సంపన్నులతో సహా 1,000 కంటే ఎక్కువ మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. ప్రముఖ ఆహ్వానితులలో బిల్ గేట్స్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ వంటి ప్రముఖ బాలీవుడ్ తారలు ఉన్నారు.శుక్రవారం నాడు పాప్ స్టార్ రిహన్నా ఈ కార్యక్రమానికి హాజరై భారతదేశంలో తన మొదటి ప్రదర్శన ఇచ్చారు. రిహన్న ‘డైమండ్స్’, ‘రూడ్ బాయ్’, ‘పోర్ ఇట్ అప్’ వంటి తన టైమ్‌లెస్ హిట్‌లను పాడి వినిపించారు.