Bihar: ప్రాణాలను పణంగా పెట్టిన లోకో పైలట్లు
బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఇద్దరు రైల్వే ఉద్యోగులు చేసిన పని సర్వత్రా చర్చనీయాంశం అయింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి రైలు లోపాన్ని సరిచేసినందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఇద్దరు లోకో పైలట్లకు సమస్తిపూర్ రైల్వే అధికార యంత్రంగం అవార్డు ప్రకటించింది.
- By Praveen Aluthuru Published Date - 03:55 PM, Sat - 22 June 24

Bihar: బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఇద్దరు రైల్వే ఉద్యోగులు చేసిన పని సర్వత్రా చర్చనీయాంశం అయింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి రైలు లోపాన్ని సరిచేసినందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఇద్దరు లోకో పైలట్లకు సమస్తిపూర్ రైల్వే అధికార యంత్రంగం అవార్డు ప్రకటించింది.
లోకో పైలట్ అజయ్ కుమార్ యాదవ్ మరియు అసిస్టెంట్ లోకో పైలట్ రంజిత్ కుమార్ నార్కతియాగంజ్ నుండి గోరఖ్‌పూర్ వెళ్లే రైలులో విధులు నిర్వహిస్తున్నారు. వాల్మీకినగర్ మరియు పనియాహ్వా మధ్య బ్రిడ్జ్ నంబర్ 382లో లోకో ఇంజిన్ అన్‌లోడర్ వాల్వ్ నుండి అకస్మాత్తుగా గాలి పీడనం రావడం ప్రారంభమైంది. దీంతో రైలు వంతెన వద్ద ఆగింది. లీకేజీ జరుగుతున్న ప్రదేశానికి చేరుకోవడానికి మార్గం లేకపోవడంతో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ తమ ప్రాణాలను పణంగా పెట్టి లీకేజీని సరిచేయాలని నిర్ణయించుకున్నారు.
#indianrailways #Viralvideo #biharnews pic.twitter.com/GBcH09d7Xm
— Khushbu Goyal (@kgoyal466) June 22, 2024
ఒకరు రైలు కింద నుంచి ట్రాక్‌పై పాకగా, మరొకరు వంతెనపై వేలాడదీసి వాల్వ్‌కు చేరుకుని దాన్ని సరిచేశారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడున్న పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు లోకో పైలట్ల పని తీరును రైల్వే శాఖ కూడా ప్రశంసిస్తోంది. వారి ధైర్యసాహసాలకు గాను సమస్తిపూర్ రైల్వే బోర్డు అతనికి 10,000 రూపాయల పురస్కారం మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తుందని ప్రకటించింది.
Also Read: CM Revanth Reddy: సీఎం చంద్రబాబు పని రాక్షసుడు: సీఎం రేవంత్