Beauty : ఉద్యోగానికి అందం అడ్డు..అయ్యో పాపం !!
Beauty : తాను నానీ (కేర్ టేకర్)గా ఉద్యోగం పొందడానికి 50 ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పటికీ, ఎక్కడా ఉద్యోగం రాలేదని ఆమె వాపోయింది. తనకు అవసరమైన నైపుణ్యాలు, అర్హతలన్నీ ఉన్నప్పటికీ కేవలం తన రూపం, అందం కారణంగా ఎవరూ నియమించుకోవట్లేదని
- By Sudheer Published Date - 01:15 PM, Sat - 20 September 25

బ్రెజిల్‌కు చెందిన 21 ఏళ్ల యువతి అలే గౌచా (Ale Gaucha) చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. తాను నానీ (కేర్ టేకర్)గా ఉద్యోగం పొందడానికి 50 ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పటికీ, ఎక్కడా ఉద్యోగం రాలేదని ఆమె వాపోయింది. తనకు అవసరమైన నైపుణ్యాలు, అర్హతలన్నీ ఉన్నప్పటికీ కేవలం తన రూపం, అందం కారణంగా ఎవరూ నియమించుకోవట్లేదని చెప్పింది. దీనివల్ల తాను మానసికంగా తీవ్రంగా కుంగిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Dasara Celebrations: విజయవాడలో దసరా మహోత్సవాలు.. అంగరంగ వైభవంగా అమ్మవారికి అలంకారాలు!
అలే గౌచా చెప్పినదాని ప్రకారం.. తాను అందంగా ఉండటమే తనకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఉద్యోగదారుల కుటుంబాల్లోని మహిళలు భర్తలతో వివాహేతర సంబంధాలు తలెత్తవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ, తాను నానీగా చేరితే కుటుంబ వాతావరణం దెబ్బతింటుందనే భయంతో నియామకం చేయట్లేదని ఆమె పేర్కొంది. ఇలాంటి అనుమానాలు, అపోహల వల్ల తాను పదే పదే తిరస్కరణకు గురయ్యానని ఆమె వివరించింది. దీనివల్ల తాను కేవలం ఒక “బ్యూటీ ట్రాప్”గా ముద్ర వేయబడ్డానని ఆమె వ్యాఖ్యానించింది.
తన కష్ట పరిస్థితిని అధిగమించడానికి, చివరికి అలే గౌచా కంటెంట్ క్రియేటర్ (అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్) రంగంలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది. ఒకవైపు తన ప్రతిభ, నైపుణ్యం నిరూపించుకునే అవకాశం దక్కకపోవడం, మరోవైపు జీవనాధారం కోసం ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవాల్సి రావడం విచారకరమని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ సంఘటన రూపం, అందం ఆధారంగా వ్యక్తులను అంచనా వేయడం ఎంతటి అన్యాయం చేస్తుందో చూపిస్తోందని, సమాజంలో ఇంకా ఉన్న వక్రదృష్టిని వెలుగులోనికి తెస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.