Miyapur Metro Station : అది చిరుత కాదట.. అడవి పిల్లి..!!
Miyapur Metro Station : మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో కనిపించిన జీవి చిరుత కాదని అడవి పిల్లి అని అటవీ అధికారులు తేల్చారు
- By Sudheer Published Date - 11:54 AM, Sat - 19 October 24

హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున చిరుత పులి (Leopard) సమాచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం మియాపూర్ మెట్రో స్టేషన్ (Miyapur Metro Station) వెనకాల నడిగడ్డ తండా ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. చిరుత సమాచారం మియాపూర్ పోలీసులకు అందించడం తో రంగంలోకి దిగిన పోలీసులు , అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలించారు.
అసలు నగరం నడిబొడ్డుకు చిరుత ఎలా వచ్చింది..? ఎక్కడినుండి వచ్చింది..? ఇంత భారీ జనాల మధ్యకు ఎలా వచ్చి ఉంటుంది..? దానిని ప్రజలు చూడకుండా ఎలా ఉన్నారు..? అంటూ నగరవాసులు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఒక్కటి మాత్రమే ఉందా.. దీనితో పాటు ఇంకా చిరుతలు ఉన్నాయా అనేది ఆందోళన వ్యక్తం చేసారు. కాగా మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో కనిపించిన జీవి చిరుత కాదని అడవి పిల్లి అని అటవీ అధికారులు తేల్చారు. నిన్న చిరుత అని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన అటవీ అధికారులు కదలికలను బట్టి అడవి పిల్లిగా తేల్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చిరుత సంచారం#viral #miyapur #hyderabad #hyderabadnews #viralvideo #leopard #telangana pic.twitter.com/bl3sWHho21
— Vishal B (@NaniVishal6) October 18, 2024
Read Also : CM Chandrababu: ఏపీలో మరో కొత్త పధకం అమలు, ముస్లింలకు పెద్ద పిటా వేసిన చంద్రబాబు..