6 Mangoes – Rs 2400 : 6 మ్యాంగోస్ రూ.2400.. కేజీ కాకర రూ.1000.. కేజీ బెండ రూ.650.. ఎక్కడ ?
నిత్యావసరాల ధరలు చుక్కలను అంటడం అనేది.. మన దగ్గర మామూలు రేంజులోనే ఉంటుంది.
- Author : Pasha
Date : 24-06-2024 - 1:55 IST
Published By : Hashtagu Telugu Desk
6 Mangoes – Rs 2400 : నిత్యావసరాల ధరలు చుక్కలను అంటడం అనేది.. మన దగ్గర మామూలు రేంజులోనే ఉంటుంది. ఫారిన్‌లో నిత్యావసరాల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పదుల రూపాయల్లో ఉండే కూరగాయల రేట్లు ఫారిన్‌లో వందల రూపాయలు పలుకుతున్నాయి. మన దేశంలో వందల రూపాయల్లో ఉండే పండ్ల రేట్లు కొన్ని దేశాల్లో వేల రూపాయల్లో ఉన్నాయి. విదేశాలలోని ధరల మంటను అద్దంపట్టే ఓ ఆసక్తికర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని గురించి తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
ఢిల్లీకి చెందిన చవి అగర్వాల్ ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నారు. అక్కడున్న ఓ ఇండియన్ స్టోర్‌లో ఎంతెంత ధరలు ఉన్నాయనేది ఆమె ఓ వీడియోలో చక్కగా వివరించారు. ఈమేరకు వివరాలతో కూడిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అక్కడున్న పండ్లు, కూరగాయల ధరల వివరాలను చవి అగర్వాల్ చెబుతుంటే విని నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. మనం లక్కీగా ఇండియాలో పుట్టాం అని పేర్కొంటూ సగర్వంగా కామెంట్లు పెడుతున్నారు. అక్కడ వ్యాపారం ప్రారంభిస్తే బెటరేమో అని మరికొందరు ఫన్నీగా బదులిచ్చారు.
Also Read : Kashi Vishwanath Dham: కాశీ విశ్వనాథ ఆలయ ఆదాయంలో రికార్డు పెరుగుదల.. సంవత్సరాల వారీగా ఆదాయం..!
- వీడియోలో చవి అగర్వాల్ చెప్పిన ప్రకారం.. లండన్‌లో కేజీ కాకరకాయల రేటు రూ.1000.
- లండన్‌లో కేజీ బెండకాయల రేటు రూ.650, ఆరు ఆల్ఫోన్సో మామిడికాయల(6 Mangoes – Rs 2400) రేటు రూ.2,400.
- లేస్ మాజిక్ మసాలా ప్యాక్ భారత్‌లో రూ.20 ఉంటే.. లండన్‌లో దాని ధర రూ.95.
- అక్కడ పన్నీర్ ప్యాకెట్ రేటు రూ.700.
Also Read : Kejriwals Bail : కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ‘బెయిల్ స్టే ఆర్డర్’పై విచారణ ఈనెల 26కు వాయిదా
బ్రిటన్ కరెన్సీ(పౌండ్ స్టెర్లింగ్)ని మనదేశానికి చెందిన రూపాయల్లో పోల్చి చూస్తే ఇదేవిధంగా ధరలు ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. బ్రిటన్ ప్రజలు ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణానికి ఈ రేట్లు నిదర్శనమని చెబుతున్నారు. వచ్చే నెల 4న బ్రిటన్ పార్లమెంటరీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడి ప్రజలు ఓటు వేసే ముందు నిత్యావసరాల ధరలను కూడా ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారని పరిశీలకులు చెబుతున్నారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానన్న హామీతో గద్దెనెక్కిన రిషి సునాక్ నిత్యావసరాల ధరల నియంత్రణలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.