Mutton Fight Viral : మటన్ ముక్క ఎంత పనిచేసింది..!!
మటన్ భోజనం లేకపోతే అసలు ఆ వేడుకకు కళే ఉండదు..అంతే ఎందుకు మటన్ భోజనాలేనా..? అని అడిగి మరి వేడుకలకు వెళ్తుంటారు
- By Sudheer Published Date - 03:20 PM, Thu - 29 August 24

తెలంగాణ (Telangana) లో నాన్ వెజ్ (Non Veg) కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారనే సంగతి తెలిసిందే. ఇంట్లో చిన్న వేడుకైన, పెద్ద వేడుకైన సరే నలుగుర్ని పిలిచి మటన్ (Mutton ) భోజనం పెడుతుంటారు. మటన్ భోజనం లేకపోతే అసలు ఆ వేడుకకు కళే ఉండదు..అంతే ఎందుకు మటన్ భోజనాలేనా..? అని అడిగి మరి వేడుకలకు వెళ్తుంటారు. ఇక వెళ్లిన బంధువులకు సంతృప్తిగా మటన్ భోజనం పెట్టాలి..ముక్క తక్కువైనా గొడవలు, కొట్లాటలు జరుగుతుంటాయి. ఇలా మటన్ వద్ద ప్రాణాలు తీసిన , పెళ్లి పెటాకులు అయినా సంఘటనలు కూడా ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్ (Nizamabad ) జిల్లాలో వెలుగుచూసింది. నవీపేటకు చెందిన యువతితో.. నందిపేట మండలానికి చెందిన యువకుడికి బుధవారం స్థానిక ఫంక్షన్ హాలులో ఘనంగా వివాహం జరిపించారు ఇరు పెద్దలు. పెళ్లికి వచ్చిన వరుడి తరపు యువకులు.. విందులో కూర్చున్నారు. అయితే తమకు మటన్ ముక్కలు తక్కువ వేశారని వడ్డిస్తున్న వ్యక్తులతో గొడవకు దిగారు. ఏమైందని అక్కడికి వచ్చిన వధువు బంధువులు ఆరా తీశారు. ఏదో తెలియక జరిగిందని చెప్పినా వరుడి తరపు యువకులు వినకపోవడంతో వాగ్వాదం తీవ్రమైంది. చేతికి అందిన వంట గరిటెలు, కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు దాడి చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఈ ఘటనలో 13 మందిపై కేసు నమోదు చేశారు. 8 మందికి తీవ్రమైన గాయాలు కావడం తో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు.
Read Also : Ambani : 2027 కల్లా భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక దేశంగా అవతరించనుంది: ముకేశ్