Yoga Robot – Tesla : ఈ రోబో యోగా మాస్టర్.. టెక్నాలజీలో టెస్లా విప్లవం
Yoga Robot - Tesla : రోబోల యుగం ఇది. ప్రత్యేకించి హ్యూమనాయిడ్ రోబోల యుగాన్ని మున్ముందు మనం చూడబోతున్నాం.
- By Pasha Published Date - 10:48 AM, Mon - 25 September 23

Yoga Robot – Tesla : రోబోల యుగం ఇది. ప్రత్యేకించి హ్యూమనాయిడ్ రోబోల యుగాన్ని మున్ముందు మనం చూడబోతున్నాం. ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ కు టెస్లా అనే కంపెనీ ఉంది. ఇది కార్ల తయారీతో పాటు రోబోటిక్ టెక్నాలజీ డెవలప్మెంట్ పైనా పనిచేస్తోంది. ఈక్రమంలోనే టెస్లా కంపెనీ ‘ఆప్టిమస్’ పేరుతో హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసింది. ఈ రోబో యోగా చేసిన ఒక వీడియోను ఆదివారం టెస్లా కంపెనీ ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ రోబో రకరకాల పనులను సొంతంగా చేస్తుంది. యోగా కూడా చేస్తుంది. ఒక కాలు మీద నిలబడి.. కాళ్లను స్ట్రెచ్ చేస్తూ యోగాసనాలను వేసే కెపాసిటీ దీని సొంతం. రెండు చేతులు దగ్గరికి జోడించి నమస్తే చెప్తున్న భంగిమను కూడా ఆప్టిమస్ రోబో ప్రదర్శించగలదు. ఈ రోబోకు సొంతంగా కాళ్లను, చేతులను నియత్రించుకోగల సామర్థ్యం ఉంది.
Also read : Raja Singh Suspension: రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత?
Elon Musk shared a fascinating video of its humanoid #robot Optimus performing a variety of tasks including doing #yoga and sorting blocks by colour autonomously.pic.twitter.com/YdLCsEoRyE
— Smriti Sharma (@SmritiSharma_) September 25, 2023
‘ఆప్టిమస్’ రోబో యోగాసనాలు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది నెటిజన్స్ టెస్లా ఏఐ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. వెల్ డన్ టెస్లా అంటూ అభినందనలు తెలిపారు. ఆప్టిమస్ రోబోను టెస్లాబోట్ అని కూడా పిలుస్తారు. ఇది 5 అడుగుల 8 అంగుళాల హైట్, 57 కేజీల బరువుతో ఉంటుంది. ఈ రోబోను తయారు చేస్తున్నట్లు 2021లోనే టెస్లా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ డే ఈవెంట్‌లో ప్రకటించింది. 2022లో టెస్లా కంపెనీ రోబో సెమీ ఫంక్షనల్ ప్రొటోటైప్‌ను ప్రపంచానికి చూపించింది. 2023లో దీనిని ప్రొడక్షన్‌కు తయారుచేస్తామని వెల్లడించింది. మనుషులు చేసే ఎన్నో పనులు చేయగలిగేలా ఈ రోబోను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొంది. టెస్లా కంపెనీ కార్ల కంటే తమకు రోబోల వ్యాపారం ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుందని ఎలాన్ మస్క్ (Yoga Robot – Tesla) నమ్ముతున్నారు.