Viral Video: పుచ్చకాయను దొంగలించిన ఏనుగు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
ప్రతిరోజూ సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ (Viral Video) అవుతున్నాయి. అయితే వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది జంతువుల క్లిప్స్ కూడా ఉంటున్నాయి.
- By Gopichand Published Date - 11:30 AM, Sun - 9 April 23

ప్రతిరోజూ సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ (Viral Video) అవుతున్నాయి. అయితే వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది జంతువుల క్లిప్స్ కూడా ఉంటున్నాయి. అవి వినోదాన్ని మాత్రమే కాకుండా కొన్నిసార్లు భావోద్వేగానికి గురిచేస్తాయి. జంతువులు ఎవరినైనా అనుకరించే వీడియోల నుంచి అన్ని రకాల వీడియోలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. అయితే ఓ ఏనుగు (Elephant) చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Elephant steals watermelon from human 🍉 pic.twitter.com/CuZYPxftsy
— Mr Moist (@moistonig) April 7, 2023
ఈ వేసవిలో తాజా పండ్లను తినడానికి మనం ఇష్టపడతాము. ఎందుకంటే పండ్లు వేడి నుండి మనకు ఉపశమనాన్ని అందిస్తాయి. పుచ్చకాయ వంటి పండ్లు సహజంగా తీపి, రిఫ్రెష్‌గా ఉండటం వల్ల చాలా మందికి పుచ్చకాయ మొదటి ఎంపిక. తాజాగా ఏనుగు చేసిన ఒక పని ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి పెద్ద పుచ్చకాయను ఆస్వాదిస్తూ తింటూ ఉంటాడు. అక్కడకి వచ్చిన ఒక పెద్ద ఏనుగు అతని వద్దకు వెళ్లి దానిని దొంగిలిస్తుంది. ఏనుగు తన తొండం ద్వారా పండును పైకి లేపి దానిలో నోటిలో పెట్టుకుని తినేస్తుంది. ఏనుగు అలా చేయటంతో ఆ పుచ్చకాయ తింటున్న వ్యక్తి షాక్ కి గురవుతాడు. ఆ వ్యక్తి ఇంకా ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఏనుగు చేసిన ఈ పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: America: అమెరికా వెళ్లాలనుకునేవారికి అలర్ట్.. వీసా దరఖాస్తు ఫీజు పెంచిన అమెరికా..!
మరోవైపు పారిశ్రామిక విస్తరణ వలన అటవీ విస్తీర్ణం కోల్పోవడం వల్ల ఏనుగులు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ఆహారం కోసం ఏనుగులు మానవ నివాసాలలోకి ప్రవేశించడం చేస్తున్నాయి. అటవీ నష్టాన్ని నియంత్రించడానికి అనేక తీవ్రమైన, కఠినమైన చర్యలు అధికారులు తీసుకుంటున్నారు.