Delhi Metro: మెట్రో ట్రైన్ లో అలాంటి పని చేస్తూ బుక్ అయిన లవర్స్.. వీడియో వైరల్?
ఈ మధ్యకాలంలో యువత ప్రేమ అన్న పిచ్చి మోజులో పడి ఎక్కడ ఉన్నాము మన చుట్టూ ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని కూడా మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక
- Author : Anshu
Date : 21-06-2023 - 5:10 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ మధ్యకాలంలో యువత ప్రేమ అన్న పిచ్చి మోజులో పడి ఎక్కడ ఉన్నాము మన చుట్టూ ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని కూడా మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ లో రొమాన్స్ లు చేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం హత్తుకోవడం చేస్తూ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెట్రోలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. లవర్స్ చుట్టూ మనుషులు ఉన్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఒక ప్రేమ జంట కూడా అలాగే మెట్రో ట్రైన్ లో రెచ్చిపోయి ప్రవర్తించారు.
అందుకు సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజెన్స్ మండిపడుతున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ చేసుకుంది? ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. ప్రయాణికులందరు మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఒక ప్రేమ జంటలు సీట్లో కూర్చొని రొమాన్స్ చేయడం మొదలుపెట్టారు. చుట్టూ జనాలు ఉన్నా అవేవీపట్టించుకోకుండా తమను అందరూ చూస్తున్నారన్న భయం కూడా లేకుండా ముద్దులు పెట్టుకున్నారు. ట్రైన్లో అందరూ చూస్తుండగానే అశ్లీలంగా ప్రవర్తించారు. అయితే వారు సిగ్గు విడిచి చేస్తున్న పనిని ట్రైన్ లో వెళ్తున్న కొందరు ప్రయాణికులు రికార్డ్ చేశారు.
Scenes at #DelhiMetro #yellowline adjacent to T2C14 towards HUDA City center @OfficialDMRC @DCP_DelhiMetro @DelhiPolice @ArvindKejriwal pic.twitter.com/A2N9LuVQDE
— Bhagat S Chingsubam (@Kokchao) June 17, 2023
అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మెట్రో ట్రైన్ అధికారులను ట్యాగ్ చేశారు. ఈ ప్రేమికుల తీరుపై నెటజిన్లు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతీ, యువకులు మితిమీరి ప్రవర్తిస్తున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరు ఈ విషయంపై స్పందిస్తూ ఇంకొన్ని రోజులు పోతే ట్రైన్లలో అలాంటి పనులు కూడా చేసేలా ఉన్నారు కదా అంటూ మండిపడుతున్నారు. ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ మెట్రో అధికారులు.. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ ఒక ప్రకటన జారీ చేసింది. ప్రయాణికులు తమను తాము నియంత్రించుకోవాలని, ప్రజా రవాణాలు ఇలాంటి చర్యలకు పాల్పడటం చట్టవిరుద్ధం అని స్పష్టం చేశారు. ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.