HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Ayurvedic Doctor Cashes In On Software Engineers Weakness

Bengaluru : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వీక్నెస్ ను క్యాష్ చేసుకున్న ఆయుర్వేద వైద్యుడు

Bengaluru : నకిలీ వైద్యుడి మాటలు నమ్మి ఆ టెకీ మొదట తన భార్య, తల్లిదండ్రుల నుండి రూ. 17 లక్షలు అప్పుగా తీసుకొని ఈ మందులు కొన్నాడు

  • By Sudheer Published Date - 10:44 AM, Tue - 25 November 25
  • daily-hunt
Ayurvedic Doctor Cashes In
Ayurvedic Doctor Cashes In

బెంగళూరు నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణమైన మోసానికి గురయ్యాడు. వివాహం తర్వాత లైంగిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఈ టెకీ, నకిలీ ఆయుర్వేద వైద్యుడిని నమ్మి ఏకంగా ₹48 లక్షలు పోగొట్టుకున్నాడు. అంతేకాక అనవసరమైన చికిత్స వల్ల కిడ్నీ సమస్యలను కూడా ఎదుర్కొంటున్నాడు. 2023లో వివాహమైన తర్వాత ఈ సమస్య తలెత్తగా, మొదట అతను కెంగేరి సమీపంలోని ఒక మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే మే 3న, KLE లా కాలేజీ దగ్గర రోడ్డు పక్కన కనిపించిన ‘ఆయుర్వేదిక్ దావఖానా’ టెంట్‌ను చూసి మోసపోయారు. అక్కడ ‘విజయ్ గురూజీ’గా పరిచయం చేసుకున్న వ్యక్తిని సంప్రదించడంతో ఈ మోసం మొదలైంది.

Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

‘విజయ్ గురూజీ’ తాను చెప్పిన ‘అరుదైన ఆయుర్వేద మందులు’ వాడితే శాశ్వతంగా నయం అవుతుందని టెకీని నమ్మించాడు. అందులో ముఖ్యంగా ‘దేవరాజ్ బూటీ’ అనే ఉత్పత్తిని యశ్వంత్‌పూర్ ప్రాంతంలోని విజయలక్ష్మి ఆయుర్వేదిక్ స్టోర్ నుండి కొనుగోలు చేయమని సూచించాడు. ఈ ‘బూటీ’ని హరిద్వార్ నుండి ప్రత్యేకంగా తెప్పించారని, దీని ధర గ్రాముకు ఏకంగా రూ. 1.6 లక్షలు అని చెప్పాడు. అంతేకాకుండా, ఈ మందు కొనేటప్పుడు ఎవరినీ వెంట తెచ్చుకోవద్దని, కేవలం నగదు రూపంలోనే చెల్లించాలని నకిలీ వైద్యుడు షరతులు పెట్టాడు. గురూజీ చెప్పిన మాటలు పూర్తిగా నమ్మిన టెకీ, మొదట ఆ మందును కొనుగోలు చేశాడు. ఆ తర్వాత గురూజీ ‘భావన బూటీ తైలం’ అనే మరో మూలిక మిశ్రమాన్ని గ్రాముకు ₹76,000 చొప్పున కొనుగోలు చేయాలని ఒత్తిడి చేశాడు.

నకిలీ వైద్యుడి మాటలు నమ్మి ఆ టెకీ మొదట తన భార్య, తల్లిదండ్రుల నుండి రూ. 17 లక్షలు అప్పుగా తీసుకొని ఈ మందులు కొన్నాడు. ఆ తర్వాత చికిత్స విఫలమవుతుందని బెదిరించి మరిన్ని ‘దేవరాజ్ బూటీ’ని కొనమని గురూజీ బలవంతం చేశాడు. దీంతో బాధితుడు రూ. 20 లక్షల బ్యాంక్ లోన్ తీసుకుని ఆ మందులు కొనుగోలు చేశాడు. ఇలా మొత్తం మీద అతను ఏకంగా రూ. 48 లక్షలు ఖర్చు చేశాడు. ఈ మోసంపై ఇంటర్నెట్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. విద్యావంతులైన వారు సైతం ఇలాంటి నకిలీ వైద్యుల చేతిలో మోసపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ayurvedic doctor
  • bengaluru
  • Software engineer
  • software engineer's weakness

Related News

Jagan Ktr

KTR & Jagan : జగన్ అన్న అంటూ కేటీఆర్ పిలుపు

KTR & Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) ఇటీవల బెంగళూరులో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది

  • A Mumbai Girl In Bengaluru

    Yogitaarathore : తనకు శాండ్‌విచ్ ఇచ్చిన బెంగళూరు క్యాబ్ డ్రైవర్‌ను ప్రశంసించిన ముంబై మహిళ! 

Latest News

  • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

  • Vemulawada : కుంగిన డబుల్ బెడ్రూం ఫ్లోరింగ్..ప్రమాదం నుండి బయటపడ్డ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

  • Sand Supply : ఆంధ్ర నుంచి తెలంగాణ కు యథేచ్ఛగా ఇసుక

  • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

  • Guwahati Test : గువాహటి టెస్టుపై అశ్విన్ పోస్ట్.. పంతూ ఏంది సామీ నీ బాడీ లాంగ్వేజ్!

Trending News

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

    • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

    • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

    • Karun Nair: కరుణ్ నాయర్ కీల‌క వ్యాఖ్యలు.. టీమిండియా పైనేనా?

    • Skanda Shashthi 2025: స్కంద షష్ఠి వ్రతం గురించి మీకు తెలుసా? ముహూర్తం, పూజా విధానం ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd