HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >A Video Of A Lonely Penguin Is Trending On Social Media

సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఒంటరి పెంగ్విన్ వీడియో!

  • Author : Vamsi Chowdary Korata Date : 26-01-2026 - 10:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Penguin
Penguin

కొన్నిసార్లు పాత జ్ఞాపకాలు కొత్త అర్థాలను వెతుక్కుంటాయి. 2007లో వెర్నర్ హెర్జోగ్ తీసిన ఒక డాక్యుమెంటరీలోని చిన్న బిట్ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. అందరూ ఒకవైపు వెళ్తుంటే తను మాత్రం ఎటు వెళ్తున్నదో తెలియని ఒక దిశలో, మంచు కొండల వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక పెంగ్విన్ వీడియో ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by @reels.olizzzz

  • ఆహారం, ఆశ్రయం కోసం వెళ్లకుండా.. ఒంటరిగా పర్వతాల వైపు వెళ్తున్న పెంగ్విన్
  • ఈ వీడియో ఆధారంగా వేల సంఖ్యలో మీమ్స్, ఫిలాసఫికల్ చర్చలు
  • ట్రెండింగ్‌లో 2007 నాటి ‘ఎన్‌కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ డాక్యుమెంటరీ క్లిప్
  • ఆధునిక కాలంలోని ఒంటరితనం, శూన్యవాదానికి ఈ పెంగ్విన్ ప్రతీక అంటున్న నెటిజన్లు

సాధారణంగా పెంగ్విన్లు గుంపులుగా సముద్రం వైపు వెళ్తాయి. కానీ ఈ వీడియోలో ఒక పెంగ్విన్ మాత్రం తన గుంపును వదిలేసి, మృత్యువు పొంచి ఉందని తెలిసినా ఆకాశాన్ని తాకే మంచు పర్వతాల వైపు వెళ్తుంటుంది. దాన్ని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేసినా అది మళ్లీ పర్వతాల వైపుకే దారి తీస్తుంది. ఈ దృశ్యం చూస్తుంటే ఆ పెంగ్విన్‌కు జీవితంపై విరక్తి కలిగిందా? లేక దానికి పిచ్చి పట్టిందా? అనే అనుమానం కలుగుతుంది.

ప్రస్తుత కాలంలో మనుషులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఒంటరితనం, ‘ఏమీ లేని శూన్యం’ అనే భావనలకు ఈ పెంగ్విన్ ఒక గుర్తుగా మారింది. “మేమంతా ఆ పెంగ్విన్ లాంటి వాళ్లమే.. ఎటో తెలియని ప్రయాణం చేస్తున్నాం” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్, టెక్‌టాక్ లలో ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.

ఈ వైరల్ వీడియో పుణ్యమా అని 19 ఏళ్ల క్రితం వచ్చిన ఆ డాక్యుమెంటరీని ఇప్పుడు మళ్లీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో జనం ఎగబడి చూస్తున్నారు. సైకాలజిస్టులు సైతం ఈ వీడియోపై స్పందిస్తూ.. ప్రకృతిలో కూడా ఇలాంటి అసాధారణ ప్రవర్తనలు ఉంటాయని, అది మనుషులకు ఒక అద్దం పట్టినట్లుగా ఉందని విశ్లేషిస్తున్నారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Animal behavior
  • Documentary
  • Existentialism
  • internet sensation
  • Mental Health
  • Nature
  • penguin
  • viral video
  • Werner Herzog

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

  • Why are plumbers respected more than engineers in the country? An Indian in Australia can earn ₹67 lakh per year.

    Viral Video: స్వదేశంలో ఇంజనీర్ల కంటే ప్లంబర్లకు ఎందుకు ఎక్కువ గౌరవం? ఆస్ట్రేలియాలోని ఒక భారతీయుడు ఏడాదికి రూ. 67 లక్షలు సంపాదించగలరు.

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd