Head In Cage : పంజరంలో తల.. స్మోకింగ్ మానేందుకు విచిత్ర శిక్ష
ఇంకా పంజరంలోనే(Head In Cage) అతగాడి తల ఉందా అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు.
- Author : Pasha
Date : 09-11-2024 - 3:57 IST
Published By : Hashtagu Telugu Desk
Head In Cage : పంజరంలోని పక్షులను మనం చూస్తుంటాం. కానీ ఒక వ్యక్తి తల చాలా ఏళ్లుగా పంజరంలోనే ఇరుక్కుపోయి ఉంది. సిగరెట్ స్మోకింగ్ మానేసేందుకు.. అతగాడు తనకు తాను విధించుకున్న కఠినాతి కఠినమైన ఆంక్ష ఇది. టర్కీకి చెందిన ఇబ్రహీం ఉకెల్ తలకు పంజరం ఉందనే వార్త చాలా పాతది. 2013లోనే ఈ న్యూస్ బయటికి వచ్చింది. అయితే తాజాగా దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇబ్రహీం ఉకెల్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అని చర్చించు కుంటున్నారు. ఇంకా పంజరంలోనే(Head In Cage) అతగాడి తల ఉందా అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. ఈ అప్‌డేట్లతో తాజాగా టర్కీలోని మీడియాలో కథనాలు వచ్చాయి. వాటిలోని వివరాలు చూద్దాం.
Also Read :Praja Vijaya Utsavalu : నవంబరు 14 నుంచి డిసెంబరు 9 వరకు ప్రజా విజయోత్సవాలు : భట్టి
- టర్కీకి చెందిన ఇబ్రహీం ఉకెల్ చైన్ స్మోకర్.
- అతగాడు తనకు టైం దొరికినప్పుడల్లా సిగరెట్లు తాగుతుండేవాడు.
- స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా.. ఇబ్రహీం అస్సలు వెనక్కి తగ్గేవాడు కాదు.
- అతడిని స్మోకింగ్ మాన్పించాలని చాలామంది కుటుంబ సభ్యులు ట్రై చేసి అలసిపోయారు. కానీ అతడు మాత్రం స్మోకింగ్ మానలేదు.
- ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అదే విధంగా ఇబ్రహీం జీవితంలోనూ ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది.
- ఇబ్రహీంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయాడు. బాగా స్మోకింగ్ చేసినందు వల్లే అతడికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. డాక్టర్ల మాటలు విన్న ఇబ్రహీంకు చెమటలు పట్టాయి. ఇక స్మోకింగ్ జోలికి పోవద్దని అతడు డిసైడయ్యాడు.
- ధూమపానం మానేయాలని డిసైడైన వెంటనే.. ఇబ్రహీం తన తల పట్టేలా 130 అడుగుల రాగి తీగతో ఒక ప్రత్యేక పంజరాన్ని తయారు చేయించాడు.
- ఆ పంజరం తాళపు చెవిని తన కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. అది ఇబ్రహీం భార్య దగ్గర ఉంటుంది.
- అప్పట్లో ఇబ్రహీం ఎక్కడకు వెళ్లినా ఈ పంజరం ధరించే వెళ్లేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడనేది ఎవరికీ తెలియదు.
- భోజనం చేసేటప్పుడు, రాత్రి నిద్రపోయేటప్పుడు మాత్రమే ఇబ్రహీం భార్య ఈ పంజరాన్ని ఓపెన్ చేస్తుంది.