Putin : ‘సెక్స్ మంత్రిత్వ శాఖ’.. శోభనానికి, డేటింగ్‌కు ఆర్థికసాయం ! ?
ఈమె ప్రస్తుతం మహిళల భద్రత, శిశు సంరక్షణకు సంబంధించిన రష్యా పార్లమెంటరీ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా(Putin) వ్యవహరిస్తున్నారు.
- By Pasha Published Date - 02:15 PM, Sat - 9 November 24

Putin : త్వరలోనే రష్యాలో ‘సెక్స్ మంత్రిత్వ శాఖ’ ఏర్పాటు కానుంది. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇంతకీ ‘సెక్స్’ కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం రష్యాకు ఏం వచ్చింది.. అనుకుంటున్నారా ? మరేం లేదు.. ఆ దేశంలో క్రమంగా జనాభా తగ్గుతూ పోతోంది. మన భారత దేశంలో జనాభా క్రమంగా పెరుగుతుంటే.. రష్యాలో మాత్రం రివర్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ పరిణామం అక్కడి పుతిన్ ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేస్తోంది. జనాభా తగ్గడం వల్ల రష్యా సైన్యానికి తగిన సంఖ్యలో సైనికులు, ఇతరత్రా విభాగాల నిపుణులు దొరకడం లేదు. ఈ లోటును పూడ్చుకునే లక్ష్యంతో సెక్స్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేందుకు పుతిన్ సర్కారు రెడీ అవుతోంది. ఈవివరాలను పుతిన్ సన్నిహితురాలు నినా ఒస్తానినా మీడియాకు వెల్లడించారు. ఈమె ప్రస్తుతం మహిళల భద్రత, శిశు సంరక్షణకు సంబంధించిన రష్యా పార్లమెంటరీ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా(Putin) వ్యవహరిస్తున్నారు.
Also Read :Elon Musk : ‘ట్రంప్’ ఎఫెక్ట్.. రూ.25 లక్షల కోట్లకు పెరిగిన ఎలాన్ మస్క్ సంపద
‘‘సెక్స్ మంత్రిత్వ శాఖ ఏర్పాటైతే.. మా దేశంలో జనాభాను పెంచే కార్యక్రమాలు పెద్దఎత్తున అమల్లోకి వస్తాయి. దేశంలోని ప్రతీ ఒక్క మహిళకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తద్వారా ప్రతీ మహిళకు ఉన్న సంతానం పొందే సామర్థ్యాన్ని శాస్త్రీయంగా నిర్ధారిస్తారు. ఇది ఒక్కో మహిళలో ఒక్కోలా ఉంటుంది. సంతానం పొందే సామర్థ్యం ఆధారంగా ఆయా మహిళలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు, పోషకాహారం అందుతాయి’’ అని రష్యా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Also Read :Seaplane : ఫ్యూచర్‌లో ఏ యిజం ఉండదు.. టూరిజం ఒక్కటే ఉంటుంది : సీఎం చంద్రబాబు
సంచలన ప్రతిపాదనలు
- రష్యా ఉజ్వల భవిష్యత్తు కోసం సాధ్యమైనంత ఎక్కువ మంది పిల్లలను కనేలా మహిళలను, వారి భర్తలను ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక టీమ్స్ ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు.
- ఇందులో భాగంగా రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల మధ్య ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం బంద్ చేయాలని ప్రతిపాదించారు. తద్వారా ఆ టైంలో భార్యాభర్తలు సంభోగించే అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
- తొలిసారి అధికారికంగా డేటింగ్‌కు వెళ్లే ఒక్కో జంటకు రూ.4,300 పారితోషికాన్ని ప్రభుత్వం నుంచి అందించాలని యోచిస్తున్నారు. అయితే తప్పకుండా సంతానం పొందుతామని వారు ప్రభుత్వానికి హామీ ఇవ్వాల్సి ఉంటుంది.
- పెళ్లి జరిగిన వెంటనే ఏదైనా లగ్జరీ హోటల్‌లో శోభనం చేసుకునేందుకు నవ దంపతులకు రూ.22 వేల దాకా సాయం చేయాలని పుతిన్ సర్కారు భావిస్తోంది.